ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలోను టెక్ ఇండస్ట్రీ 2 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిందని నాస్‌కాం ప్రశంసించింది. మార్చి 31, 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇండియా టెక్నాలజీ సెక్టార్ వృద్ధి రేటు 7.7 శాతం పెరిగి 191 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. గత ఏడాది 8.1 శాతం వృద్ధి రేటు కాగా, మందగమనం నేపథ్యంలో ఇప్పుడు స్వల్పంగా తగ్గనుంది.

2 లక్షలకు పైగా ఉద్యోగాలు
మందగమనం వంటి వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వృద్ధి పథంలో సాగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ రంగంలో 2.05 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించింది. దీంతో దేశ ఐటీ, బీపీఓ రంగంలో పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 43.6 లక్షలకు చేరుకుందని టెక్ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే నాస్‌కాం జాతీయ చైర్మన్ కేశవ్ మురుగేష్ చెప్పారు.

వృద్ధి రేటు తగ్గడానికి కారణం...
2019-20 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయం 8.4% వృద్ధిరేటుతో 191 బిలియన్ డాలర్లకు(దాదాపురూ.13.50 లక్షల కోట్లు) చేరుకుంటుందని నాస్‌కాం అంచనా వేసింది. అయితే డాలర్‌తో రూపాయి తరుగుదల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఆదాయ వృద్ధిరేటు 7.7% పరిమితమైంది.

23 శాతం పెరిగినప్పటికీ...
ఏడాది డిజిటల్ టెక్నాలజీ సేవల ఆదాయం 23% వరకు పెరగనుందని నాస్‌కాం పేర్కొంది. ట్రేడ్ వార్, అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న స్వీయ వాణిజ్య రక్షణ విధానాలు మన సాఫ్టువేర్ ఎగుమతులకు ప్రధాన అడ్డంకులని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొత్త తరం డిజిటల్ ఆదాయాల్లో వృద్ధి నమోదైందని, అయితే భవిష్యత్తపై మాత్రం జాగరూకతతో కూడిన ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు నాస్‌కాం తెలిపింది.

కొత్త డిజిటల్ టెక్నాలజీ శిక్షణ కోసం 1.5 శాతం ఖర్చు
బ్రెగ్జిట్ ప్రభావంపై స్పష్టత రావాల్సి ఉంది. ఐటీ, బీపీఓ రంగంలో ఉన్న ఉద్యోగులకు కొత్త డిజిటల్ టెక్నాలజీల నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం కూడా పరిశ్రమకు పెద్ద సవాల్‌గా మారింది. ఇందుకోసం పరిశ్రమవర్గాలు తమ ఆదాయంలో 1.5 శాతం వరకు ఖర్చు చేయవలసి వస్తోంది. ఇదిలా ఉండగా, ఐటీపై కరోనా ప్రభావం విషయంలోను స్పష్టంత రావాల్సి ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications