ITC: ఐటీసీలో స్టాక్‍లో ర్యాలీ.. ఇప్పుడు కొనుగోలు చెయ్యొచ్చా..!
ప్రముఖ కంపెనీ ITC స్టాక్‌లో గత కొంత కాలంగా ర్యాలీ కనిపిస్తుంది. శుక్రవారం ఐటీసీ స్టాక్ రూ. 341 వద్ద ముగిసింది. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు ఐటీసీలో పెట్టుబడి పెట్టొచ్చని బ్రోకింగ్ సంస్థలు చెబుతున్నాయి. స్వల్పకాలానికి ఐటీసీ టార్గెట్ ప్రైస్ ను రూ. 350 నుంచి రూ. 356గా ఉంటుందని అంచనా వేశాయి.
ఈ ఏడాది తొలి ట్రేడింగ్ రోజు జనవరి 2న ఐటీసీ షేరు ధర రూ.219.10 ఉండేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రూ. 125కు పైగా పెరిగినట్లు వివరిస్తున్నారు. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా 5 సంవత్సరాలలో మొదటిసారిగా సెప్టెంబర్ 2న 4 ట్రిలియన్లను దాటిందని చెప్పాయి. ఐటీసీ మార్కెట్ క్యాప్ చివరిసారిగా 2017లో రూ. 4 ట్రిలియన్‌లను తాకిందట.
సెప్టెంబర్ త్రైమాసికం
ITC లిమిటెడ్ సెప్టెంబర్ 2022తో ముగిసే త్రైమాసికంలో నికర లాభం దాదాపు 21% పెరిగి రూ.4,466 కోట్లకు చేరుకుంది. ఐటీసీకి సిగరెట్లు, అగ్రి, హోటల్‌ల వ్యాపారాలు ఉన్నాయి. "ఐటిసి సిగరెట్ మార్కెట్‌లో ఆర్గనైజ్డ్ షేర్ పెరగడం వల్ల లాభపడుతోంది. డిజిటల్ అడాప్షన్‌పై దృష్టి సారించడంతో, కస్టమర్ సెంట్రిసిటీ మరియు చురుకుదనం ITC విభాగాల్లో బలమైన వృద్ధిని అందిస్తోంది"బ్రోకరేజ్ Edelweiss పేర్కొంది.

మధ్యస్థం నుంచి దీర్ఘకాలికం
చెల్లించదగిన పన్ను విధానం, విభాగాలలో ఆరోగ్యకరమైన పనితీరుతో, దేశీయ బ్రోకరేజ్, పరిశోధనా సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ మధ్యస్థం నుంచి దీర్ఘకాలిక దృక్పథం వరకు ఐటీసీ స్టాక్‌పై సానుకూలంగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం, ఇతరలు కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందడం వల్ల ఐటీసీ మెరగైన స్థానంలో ఉందని బ్రోకరేజ్ ఫిలిప్‌క్యాపిటల్ పేర్కొంది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. స్టాక్ ల్లో పెట్టుబడి పెట్టాలంటే నిపుణులను సంప్రదించడం మంచిది.