For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019లో ముఖేష్, జాక్ మా ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా? RILతో మీకు 4 ఏళ్లలో డబుల్ లాభం

|

దాదాపు ఈ ఏడాది మొత్తం ప్రపంచంతో పాటు భారత్ ఆర్థిక మందగమనంతో ఇబ్బంది పడుతోంది. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు కలిసి రాలేదనే చెప్పాలి. కానీ ఆసియా అత్యధిక ధనికుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతకు మాత్రం ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ కంపెనీ షేర్లు దూసుకెళ్లాయి. దీంతో కంపెనీ ఆస్తులతో పాటు ఆయన ఆస్తులు భారీగా పెరిగాయి.

మీకు షాప్ ఉందా? పెట్టుబడి లేకుండానే... అమెజాన్ సూపర్ ఆఫర్!!మీకు షాప్ ఉందా? పెట్టుబడి లేకుండానే... అమెజాన్ సూపర్ ఆఫర్!!

17 బిలియన్ డాలర్లు పెరిగిన ఆస్తి

17 బిలియన్ డాలర్లు పెరిగిన ఆస్తి

2019 ఏడాది ముఖేష్ అంబానీకి బాగా కలిసి వచ్చింది. డిసెంబర్ 23వ తేదీ నాటికి ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఆస్తులు ఏకంగా 18 బిలియన్ డాలర్లు పెరిగాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని నికర ఆస్తులు 60.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంటే ఈ ఏడాది గతంలోని ఆస్తితో పోలిస్తే దాదాపు 40 శాతం వరకు పెరిగినట్లుగా భావించవచ్చు.

చైనా జాక్ మా కంటే ఎక్కువ ఆదాయం

చైనా జాక్ మా కంటే ఎక్కువ ఆదాయం

చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ ఫౌండర్ జాక్ మా ఆస్తుల కంటే ముఖేష్ అంబానీ సంపాదనే ఈ ఏడాది ఎక్కువగా ఉంది. 2019లో ముఖేష్ ఆస్తులు 18 బిలియన్ డాలర్లు పెరగగా, అలీబాబా ఆస్తులు 11.3 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగాయి. రిలయన్స్ షేర్లు ఈ ఏడాది 40 శాతం వరకు పెరగడంతో ముఖేష్ ఆస్తులు కూడా పెరిగాయి. ఇదే కాలంలో ఇండియా బెంచ్ మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడిన దాని కంటే రిలయన్స్ స్టాక్స్ రెండింతలు పెరిగాయి.

కొత్త రంగాల్లో పెట్టుబడులు

కొత్త రంగాల్లో పెట్టుబడులు

టెలి కమ్యూనికేషన్స్ సహా వివిధ రంగాలు, పెట్టుబడుల కారణంగా రిలయన్స్ షేర్ ర్యాలీ చేస్తోంది. ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్‌తో ముఖేష్ అంబానీ టెలికం, రిటైల్ రంగాలలో అడుగు పెట్టారని, తద్వారా రిలయన్స్‌ను ఓ స్థాయికి తీసుకు వెళ్లారని, టీసీజీ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చక్రి లోకప్రియ అన్నారు.

నాలుగేళ్లలో రెట్టింపు లాభం

నాలుగేళ్లలో రెట్టింపు లాభం

రానున్న నాలుగేళ్లలో రిలయన్స్ షేర్ హోల్డర్స్ తమ ఇన్వెస్ట్‌మెంట్‌పై రెట్టింపు లాభాలను చూడవచ్చునని చక్రి లోకప్రియ అన్నారు. రానున్న కొన్నేళ్లలో రిలయన్స్ కొత్త వెంచర్స్ ద్వారా 50 శాతం ఆదాయం కంపెనీకి రానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 32 శాతంగా ఉంది.

షేర్ పెరగడానికి మరో ముఖ్య కారణం

షేర్ పెరగడానికి మరో ముఖ్య కారణం

రిలయన్స్ షేర్ పెరగడానికి మరో ముఖ్య కారణం ఉందని, కంపెనీ రుణాలను సున్నాకు తీసుకు వెళ్లడమే లక్ష్యంగా ఆయన ప్రకటన చేసారని, ఇది కంపెనీకి కొత్త ఊపిరి తీసుకు వచ్చిందని చెబుతున్నారు. 2021 నాటికి కంపెనీని జీరో డెబిట్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆగస్ట్ నెలలో చెప్పారు. దీనికి తోడు సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోతో ఒప్పందం, టెలికం రంగంలో వేగంగా దూసుకెళ్లడం వంటివి రిలయన్స్‌కు కలిసి వస్తున్నాయి.

English summary

2019లో ముఖేష్, జాక్ మా ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా? RILతో మీకు 4 ఏళ్లలో డబుల్ లాభం | Mukesh Ambani richer by dollar 18 billion in 2019, net worth crosses dollar 60 billion

It may not have been a good year for the Indian economy but Asia's richest man and Reliance Industries Limited (RIL) chief Mukesh Ambani has a lot to cheer about.
Story first published: Tuesday, December 24, 2019, 15:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X