భారత్‌కు చెందిన కంపెనీలు అన్నికూడా నియామకాలు చేపడుతున్నాయి. ప్రధానంగా ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాల్లో జోరు పెంచాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఐటీ రంగం భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయసంస్థలు చాలామంది ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా గత ఏడాది నియమకాలు అంతంత మాత్రమే. కానీ ఈసారి పుంజుకుంటున్నాయి.

నియామకాలు జూమ్
కార్పొరేట్ రంగంలో డిజిటలైజేషన్ కారణంగా ఐటీ సేవలకు ఎనలేని డిమాండ్ నెలకొంది. ఇందులో భాగంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ ఐటీకంపెనీలు వేలాదిమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. గత ఏడాది నియమించుకున్న వారితో పోలిస్తే 45 శాతం వరకు అధికంగా ఉండవచ్చునని అంటున్నారు. అంటే లక్ష మందికి ఉపాధి కల్పించనున్నాయి. లింక్డిన్ ఫ్యూచర్ ఆఫ్ టాలెంట్ రిపోర్ట్‌లోను ప్రతి 10 కంపెనీల్లో 9 కంపెనీలు (93 శాతం) నియామకాలు వేగవంతం చేయనున్నట్లు తెలిపాయి.

నియామకాలు పెంచుకుంటున్నాయి
ప్రతి పది కంపెనీల్లో ఏడు కంపెనీలు తమ అంతర్గత దృక్పథం, పురోగతి కోసం నియామకాలు పెంచుకుంటున్నట్లు తెలిపాయి. భారత్‌లో కంపెనీలు నియామకాలు చేపట్టే సమయంలో ప్రధానంగా మూడు అంశాలను చూస్తాయి. మంచి కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, టైమ్ మేనేజ్‌మెంట్‌ను చూస్తాయి. ఈ సర్వే భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, మలేషియా, పిలిప్సీన్, సింగపూర్ దేశాల్లో చేశారు.

ఐటీ దూకుడు
ఉద్యోగ నియామకాల్లో TCS దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేలమంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఇన్ఫోసిస్ 26 వేలమందిని, HCL టెక్నాలజీస్ కూడా 12 వేలమందిని తీసుకోనున్నాయి. డేటా అనలటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవడానిక ిసంస్థలు క్యూ కడుతున్నాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications