కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు స్తంభించాయి. ఈ మహమ్మారి కారణంగా కంపెనీలు తమ హెచ్ఆర్ పద్ధతులను రీవ్యాల్యుయేట్ చేస్తూ కరోనా సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమవుతున్నాయి. 50 శాతం కంపెనీలు తమ వేతన బడ్జెట్లో మార్పు లేదని చెబుతున్నాయి. 36 శాతం కంపెనీలు వేతన బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నాయి. ఈ మేరకు KPMG సర్వేలో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం..

ప్రమోషన్లకు బ్రేక్
కరోనా నేపథ్యంలో మానవవనరుల విధానాలను సమీక్షించుకుంటున్నామని KPMG సర్వే తెలిపింది. కరోనా హెచ్ఆర్ ప్రాక్టీసెస్ సర్వే రిపోర్ట్ పేరుతో నివేదికను తయారు చేసింది. ఉద్యోగుల జీతభత్యాలు, కొత్త నియామకాలు, ఉద్యోగుల మంచి చెడుకు సంబంధించి వంటి అంశాలను పరిశీలించి విశ్లేషించింది ఈ సర్వే. 50 శాతం కంపెనీలు ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను వాయిదా వేశాయి లేదా రద్దు చేసే ఆలోచనతో ఉన్నాయి. ఐటీ సెక్టార్, ఐటీఈఎస్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, రిటైల్ రంగాల్లోని సంస్థలు యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాయి.

అధిగమించేందుకు సిద్ధం
ఉద్యోగస్థాయిలలో ప్రమోషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇందులో 33 శాతం సంస్థలు ప్రమోషన్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపాయి. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ కంపెనీల ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కంపెనీలు మరిన్ని ప్రోత్సాహక చెల్లింపులు వాయిదా వేయడం లేదా స్తంభింప చేయడం జరగవచ్చు లేదా నిలిపివేయవచ్చు. ఈ మహమ్మారిని అధిగమించేందుకు కంపెనీలు సంసిద్ధమవుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది.

ల్యాప్‌టాప్ ఇస్తూ..
ఈ సర్వేలో పాల్గొన్న IT/ITES, కన్సల్టెన్సీ సేవల విభాగాలకు చెందిన 68 శాతం సంస్థలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. 48 శాతం సంస్థలు తమ సిబ్బందికి ఇంటి నుండి పని చేసేందుకు సెక్యూర్డ్ కనెక్షన్ ల్యాప్‌టాప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పీఎస్‌యూలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిటైల్ విభాగాల్లోని కొన్ని కంపెనీలు తమ సిబ్బందిని సొంత ల్యాప్‌ట్యాప్‌తో ఇంటి నుండి పని చేసేందుకు అనుమతించాయి.

నూతన నియామకాల్లేవు
కరోనా కారణంగా చాలా సంస్థలు ఇప్పుడు మరింత లిక్విడిటీ, సౌకర్యవంతమైన మార్గంలోకి వెళ్తున్నాయి. వ్యాపారాల కొనసాగింపు, శ్రామిక శక్తి నిర్వహణపై కొత్త వ్యూహాలు, కొత్త ఆపరేటింగ్ మోడల్స్ అవసరమని చెబుతున్నారు. కరోనా కారణంగా కంపెనీలు కొత్త నియామకాలను 66 శాతం మేరకు నిలిపివేశాయి. 30 సంస్థలు తమ సిబ్బంది బడ్జెట్ తగ్గిస్తున్నాయి. సిబ్బందికి ఈ-వెబినార్స్, ఈ-లెర్నింగ్ పద్ధతిలో శిక్షణ నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 20 ప్రధాన వ్యాపార రంగాలకు చెందిన 315 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications