ముంబై: స్టాక్ మార్కెట్‌లో ఇవ్వాళ కూడా రక్తపాతం కనిపించింది. షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. లక్షల కోట్ల రూపాయల మేర షేర్లు నష్ట పోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లన్నీ నెగెటివ్‌లో ట్రేడింగ్ అయ్యాయి. పేటీఎం షేర్లు పాతాళానికి పడిపోయాయి. రికార్డు స్థాయిలో క్షీణించాయి. స్టాక్ మార్కెట్‌కు డ్రైవింగ్ ఫోర్స్‌గా చెప్పుకొనే అన్ని రంగాలకు సంబంధించిన షేర్ల రేట్లు భారీగా తగ్గాయి. అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌పై తీవ్రంగా పడింది. మొత్తంగా 8.6 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయింది.

1,747 పాయింట్లు..
సెన్సెక్స్.. ఇవ్వాళ ఆరంభం నుంచే మార్కెట్ రెడ్ జోన్‌లో ట్రేడింగ్ అవుతూ వచ్చింది. ఏ దశలో కూడా అప్పర్ సర్కుట్‌లో ట్రేడింగ్ నమోదు కాలేదు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో ఇలాంటి మహా పతనాలు తరచూ మార్కెట్‌లో కనిపిస్తోన్నాయి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి 1,747 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 56,405.8 పాయింట్ల వద్ద నిలిచింది.
ఒకదశలో 1,800 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ కొంతవరకు పుంజుకోగలిగింది. తన నష్టాన్ని స్వల్పంగా పూడ్చుకోగలిగింది.

నిఫ్టీ అదే పరిస్థితి..
నిఫ్టీ కూడా ఇదే పతనాన్ని చవి చూసింది. 560.8 పాయింట్లను నష్టపోయింది. 16,814 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను భారీగా అమ్ముకోవడం వల్ల నెగెటివ్ ట్రెండింగ్ నెలకొందని పేర్కొన్నాయి. తొలి గంట నుంచి చివరి వరకూ ఏ దశలోనూ మార్కెట్ మెరుగుపడలేదు.

ఇంట్రాడే ట్రేడింగ్ అంతా..
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇంట్రాడే మొత్తం ఎక్కడే గానీ మార్కెట్ పుంజుకోలేదు. తొలి గంట నుంచే సెన్సెక్స్ గ్రాఫ్ నేలచూపులు చూడటం మొదలు పెట్టింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, రియల్ ఎస్టేట్స్ సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్ల ధరలన్నీ దారుణంగా పడిపోయాయి. ఐటీ, ఆటో, మెటల్, పవర్, ఫార్మాసూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ 2 నుంచి 6 శాతం మేర నష్టపోయాయి.

నష్టపోయిన షేర్లివే..
జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, శ్రీసిమెంట్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహేంద్ర బ్యాంక్ వంటి షేర్లు ఆరు శాతం వరకు నష్టపోయాయి. టీసీఎస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అది కూడా నామమాత్రంగా. 0.9 శాతం మేర మాత్రమే టీసీఎస్ షేర్లు అప్పర్ సర్కుట్‌లో ట్రేడ్ అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీలోనూ నష్టపోయాయి.

పేటీఎం ఘోరం..
పేటీఎం షేర్ మూడంకెలకు పడిపోయింది. 900 రూపాయల దిగవకు ట్రేడింగ్ అయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి పేటీఎం షేర్ ధర 862.40 పైసల వద్ద ట్రేడ్ అయింది. నిజానికి- ఈ షేర్ కటాఫ్ ప్రైస్ ధర 2,150 రూపాయలు. ఒక్కో షేర్ మీద మొత్తంగా 1300 రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది ఇన్వెస్టర్లకు. ఇవ్వాళ ఒక్కరోజే రూ.44.10 పైసలను కోల్పోయింది. లిస్టింగ్ డే నాడు ఇన్వెస్టర్ల పంట పండించిన నైకా పరిస్థితి కూడా ఇంతే. నైకా షేర్ ధర 1,516 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఒక్కరోజే రూ.128.90 పైసలను నష్టపోయింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications