ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరింది. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టారు. అంతరిక్షం, రక్షణ రంగాల నుంచి సైతం భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం ఆయుధాలను దిగుమతి చేసుకునేందుకే పరిమితమైన భారత్.. ఇప్పుడు పలు రకాల రక్షణ సామాగ్రిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశం.

స్వావలంబన దిశగా..
భారతదేశాన్ని రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ హబ్‌గా మార్చాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రంలోని భాజపా సర్కారు పావులు కదుపుతోంది. వచ్చే రెండేళ్లలో దేశీయ ఆయుధ ఎగుమతులను దాదాపు 5 బిలియన్ డాలర్లకు గణనీయంగా పెంచుకోవాలని యోచిస్తోంది.

డిఫెన్స్ హబ్ గా మార్చాలి:
బెంగళూరులో జరుగుతున్న 'మెగా ఏరో ఇండియా 2023'కి అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చాయి. ఇండియాను డిఫెన్స్ హబ్ గా మార్చాలనే తన ఆశయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేదికపై వెల్లడించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న 5 రోజుల్లో రూ.750 బిలియన్ల విలువైన రక్షణ ఒప్పందాలు చేసుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. పౌర విమానయాన డిమాండ్ తీర్చడానికి జెట్ లైనర్ కొనుగోళ్ల కోసం చూస్తున్నామన్నారు.
ఎక్కువ భాగం స్థానిక తయారీదారులకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ప్రైవేట్ రంగానికి ఆహ్వానం:
"2021-22లో సాధించిన 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ హార్డ్ వేర్ ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రక్షణ రంగంలో పెట్టుబడులను సులభతరం చేయడానికి చట్టాలను మార్చాం. ఈరోజు ఇండియా కేవలం డిఫెన్స్ కంపెనీలకు కేవలం మార్కెట్ మాత్రమే కాదు భాగస్వామి కూడా. రక్షణ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రైవేటు రంగాన్ని ఆహ్వానిస్తున్నాను. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మరింత దూసుకు వెళ్దాం" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మూడేళ్లలో 200 శాతానికి:
ఆదివారం జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. రక్షణ రంగంలో భారత్ ను స్వయం సమృద్ధిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 2024 నాటికి రూ.25 వేల కోట్ల విలువైన రక్షణ ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.రాబోయే మూడేళ్లలో రక్షణ ఎగుమతులను 200 శాతానికి పైగా పెంచుతామని మరోసారి స్పష్టం చేశారు.

అతిపెద్ద దిగుమతిదారు:
రక్షణ రంగంలో పెద్ద ఎగుమతిదారుగా భారత్ ను తయారుచేయాలని భాజపా సర్కారు చూస్తోంది. కానీ ఆయుధాల విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతున్నాం. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం.. 12 ఇండో-పసిఫిక్ దేశాల్లో ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. 2017-2021 మధ్య కాలంలో ప్రపంచ ఆయుధ కొనుగోళ్లలో మనం 11 శాతం వాటా కలిగి అతిపెద్ద దిగుమతిదారుగా నిలిచాం.

ఇవీ మన ఎగుమతులు:
ఫిలిప్పీన్స్, మారిషస్, ఈక్వెడార్ లకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL)కు చెందిన ధృవ్ హెలికాప్టర్‌లు విక్రయించాం. రష్యా-ఇండియా వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు అందజేశాం. HAL కూడా తన తేజస్ లైట్ ఫైటర్ జెట్‌ను కూడా మలేషియాకు విక్రయించింది.

ఆసియాలో మంచి గుర్తింపు:
ఈ ఐదు రోజుల ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ కు ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు ఉంది. ఇందులో 700కి పైగా భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థలు, 100 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు పలువురు రక్షణ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. దాదాపు 250 బిజినెస్-టు-బిజినెస్ ఒప్పందాలు కుదరనున్నాయని, తద్వారా దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications