2020-21 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి చేసుకున్న వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మొబైల్ హ్యాండ్‌సెట్ ధరలు 2 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు భారతీయ మార్కెట్లో తక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. బడ్జెట్‌లో దిగుమతి చేసుకునే ఫినిష్డ్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు.

ఇవి 20 శాతం వరకు పెరగవచ్చు
కస్టమ్స్ డ్యూటీ పెంపు కారణంగా మొబైల్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ పెంపు 15 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటుంది. మదర్ బోర్డ్ లేదా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ (PCBA) ధరలు 10 శాతం నుంచి 20 శాతం పెరుగుతుంది.

7 శాతం వరకు మొబైల్ ధరలు పెరగొచ్చు
మొబైల్ హ్యాండ్స్ సెట్స్ తయారీకి ఉపయోగించే ఇతర విడిభాగాలపై కూడా ధరల ప్రభావం ఇలాగే పడనుంది. అంతిమంగా మొబైల్ ఫోన్లపై 4 శాతం నుంచి 7 శాతం వరకు ప్రభావం పడుతుందని, ఆ మేరకు ధరలు పెరుగుతాయని techARC రీసెర్చ్ సంస్థ చీఫ్ అనలిస్ట్, ఫౌండర్ ఫైజల్ కవూసా అన్నారు.

అలా అయితే ప్రోత్సాహకం
అయితే దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించడం కోసమే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ ప్రభావం ఎక్కువగా ఉండాలని కవూసా అన్నారు. లేదంటే కస్టమ్స్ డ్యూటీ అధికంగా లేకుంటే దేశీయ తయారీదారులకు ప్రోత్సాహకంగా ఉండదని చెబుతున్నారు.

97 శాతం భారత్‌లో తయారవుతున్నాయి..
మార్కెట్లో అమ్ముడవుతోన్న ఫోన్లలో 97 శాతం భారత్‌లోనే తయారు అవుతున్నాయి. కొన్ని విడిభాగాలను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కేవలం ధర రూ.40వేల పైన ఉండే ఫోన్లలో కొన్ని మాత్రమే విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఆపిల్ సైతం కొన్ని మోడల్స్ భారత్‌లో తయారు చేస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications