For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో మాస్టర్ కార్డ్ క్రిప్టో క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్స్

|

క్రిప్టో కరెన్సీ పట్ల ఆసక్తి ఉందా? ఇప్పటికే మీరు వివిధ రకాల క్రిప్టోలు కొనుగోలు చేశారా? అయితే మీకో శుభవార్త. త్వరలో క్రిప్టో కరెన్సీ కార్డ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం మూడు డిజిటల్ కరెన్సీ కంపెనీలతో పేమెంట్ కార్డ్ నెట్ వర్క్ మాస్టర్ కార్డ్ ఒప్పందం కుదుర్చుకుంది. అంబేర్, బిట్ క్యూబ్, కాయిన్‌జార్ అనే క్రిప్టో కరెన్సీ సర్వీస్ ప్లాట్‌ఫామ్స్‌తో ఒప్పంద సంతకం చేసింది. క్రిప్టో కరెన్సీలతో ట్రాన్సాక్షన్ నిర్వహణకు, భాగస్వాములు కావడానికి ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారని మాస్టర్ కార్డ్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామా శ్రీధర్ తెలిపారు.

పెట్టుబడులకు ఇది కొత్త ప్లాట్‌ఫామ్ అన్నారు. ఫైనాన్షియల్స్ టూల్స్‌కు, డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అపూర్వ అవకాశం అననారు. ప్రతి త్రైమాసికానికి ప్రజల్లో క్రిప్టో కరెన్సీల పట్ల ఆసక్తి, ఆకర్షణ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం క్రిప్టో పట్ల ఆసక్తిగా ఉందన్నారు.

క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్స్

క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్స్

మాస్టర్ కార్డ్ గతంలో బిట్ కాయిన్, ఎథేరియంల ద్వారాట్రాన్సాక్షన్స్‌కు అనుమతి ఇచ్చింది. ఆసియా పసిఫిక్ రీజియన్ పరిధిలో 45 శాతం మంది ప్రజలు వచ్చే ఏడాది నుండి క్రిప్టో కరెన్సీని ఉపయోగించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మాస్టర్ కార్డ్ సర్వేలో వెల్లడైంది. తాజాగా ఆసియా ప్రాంతంలోని హాంగ్‌కాంగ్ క్రిప్టో ఫైనాన్స్ కంపెనీ అంబర్ గ్రూప్, థాయ్‌లాండ్ క్రిప్టో ఎక్స్చేంజ్ బిట్‌క్యూబ్, ఆస్ట్రేలియా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కాిన్‌జార్‌లతో చేతులు కలిపింది.

ఈ భాగస్వామ్యం ద్వారా క్రిప్టోకరెన్సీ లింక్డ్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ తీసుకు రానున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇండివిడ్యువల్స్, వ్యాపారాలకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ కార్డ్స్ కలిగిన వారు తక్షణమే బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలను ఫియట్ కరెన్సీలోకి మార్చుకోవచ్చు. మాస్టర్ కార్డ్ చెల్లింపులను అంగీకరించే వ్యాపారుల వద్ద ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఖర్చు చేయవచ్చు.

సేవల విస్తరణ

సేవల విస్తరణ

ఆసియా పసిఫిక్ ప్రాంతాలో క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ పట్ల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోందని మాస్టర్ కార్డ్ తెలిపింది. ఈ ప్రాంతంలో 45 శాతం మంది క్రిప్టోను వినియోగిస్తామని చెప్పగా, గ్లోబల్ యావరేజ్ 40 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. మాస్టర్ కార్డ్ ప్రత్యర్థి సంస్థ వీసా కూడా అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో ఆధిపత్య వాటాను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ కార్డ్ తన సేవలను మరింతగా విస్తరిస్తోంది.

గతంలో న్యూయార్క్ లిస్టెడ్ కంపెనీతో..

గతంలో న్యూయార్క్ లిస్టెడ్ కంపెనీతో..

ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్చేంజ్ ద్వారా రూపొందించబడిన డిజిటల్ అసెట్ ప్లాట్‌ఫామ్ న్యూయార్క్ లిస్టెడ్ బక్త్‌తో జత కట్టింది. ఇది కూడా డిజిటల్ అసెట్ ప్లాట్‌ఫామ్. మాస్టర్ కార్డ్ తాజా ఒప్పందం ద్వారా బ్యాంకులు, మర్చంట్స్ మాస్టర్ కార్డ్ నెట్ వర్క్ ద్వారా క్రిప్టో సంబంధిత సేవలను అందించే అవకాశం ఉంటంది.

English summary

త్వరలో మాస్టర్ కార్డ్ క్రిప్టో క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్స్ | Mastercard partners with leading digital currency companies

Mastercard has partnered with three digital asset platforms in Asia to issue payment cards that will allow consumers in the region to convert bitcoin and other cryptocurrencies into fiat currencies.
Story first published: Wednesday, November 10, 2021, 9:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X