ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. దాదాపు కంపెనీలు అన్నీ తమ ఉత్పత్తులు నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఆయా కంపెనీలకు నష్టాల భయాలు పట్టుకున్నాయి. ఎన్నో కంపెనీలు వేతనాలు పూర్తిగా ఇవ్వలేక లేదా వేతనాలు నిలిపివేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో రంగం పడకేసింది. లాక్ డౌన్ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్సీ భార్గవ మాత్రం పరిస్థితి మారుతుందని చెబుతున్నారు.

కరోనా చేసిన దూరం.. ఆటో సేల్స్ పెరుగుదల
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తొలగించిన తర్వాత, పరిస్థితులు కుదుట పడిన తర్వాత తమ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయని ఆటోమొబైల్ పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో కరోనా వైరస్ అలవాటు చేసిన సామాజిక దూరమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

సగటు వ్యక్తి ఆలోచనలో మార్పులు
ఓ ప్రయాణికుడితో కలిసి మరో ప్రయాణికుడు వెళ్లేందుకు భయపడే పరిస్థితులు వస్తే కొనుగోళ్లు పెరగవచ్చునని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. గతంలో మాదిరిగా భారతీయులు అలాగే ఉండరని అభిప్రాయపడ్డారు. కొనుగోలు విషయంలో వారి ఆలోచనల్లో మార్పులు వస్తాయని చెప్పారు.

మరింత దిగజారిన పరిస్థితి
ఆర్థిక స్తంభన తర్వాత గతంతో పోల్చుకుంటే చైనా దేశీయులు పర్సనల్ వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారని చెప్పారు. లాక్ డౌన్‌కు ముందు కూడా మందగమనం కారణంగా ఆటోమొబైల్ సేల్స్ ఆశాజనకంగా లేవు. దీంతో ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారింది.

ప్యాకేజీ..
ఆర్సీ భార్గవ వ్యాఖ్యల్లోను కొంత వాస్తవం ఉందనే వారు లేకపోలేదు. చైనా డేటా అలాగే ఉందని చెబుతున్నారు. వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది. ఆటో పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించాలని మారుతీ భార్గవ ఇదివరకే కోరారు.

ఆర్థిక వ్యవస్థకు దెబ్బే
అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగింపు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బేనని ఆర్సీ భార్గవ అన్నారు. గత నెలలో ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు దానిని మే 3వ తేదీ వరకు పొడిగించారు. లాక్ డౌన్ పొడిగింపు మొత్తం అవసరం లేదని, హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఈ 21 రోజుల్లోనే హాట్ స్పాట్ కేంద్రాలు గుర్తించాలని, ఇప్పటికే వివిధ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. కేంద్రం కూడా ఏప్రిల్ 20 తర్వాత హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించి మిగతా చోట్ల సడలింపులు ఇస్తామని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకూడదన్నారు.

వేరే మార్గం లేదు
లాక్ డౌన్ విషయానికి వస్తే హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించాలని, ప్రభావం లేని ప్రాంతాలను తెరవాలని, ఆ ప్రాంతాల్లో ఆర్థికకార్యకలాపాలు ప్రారంభం కావాలని, ఉద్యోగులు, విక్రేతలు, రవాణాదారులు సంబంధించి కొన్ని భద్రతా విధానాలు పాటించాలని చెప్పారు. కరోనా మహమ్మారి సవాల్‌ను పరిశ్రమ స్వీకరించేందుకు సిద్ధంగా ఉందా అంటే.. వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డారు.

ప్రధానిని అనుసరించాల్సిందే
రాజకీయ నాయకుడికి, ప్రజలకు మధ్య ఇంత యూనిక్ సంబంధం చూడలేదని, అంతకుముందు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విషయంలో ఇలా జరిగిందని, ఇప్పుడు మళ్లీ చూస్తున్నామని, ప్రధాని చెప్పింది ప్రజలు వింటున్నారని చెప్పారు. ప్రభుత్వం రక్షణాత్మక చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారన్నారు.

నాలుగో అతిపెద్ద సంస్థ
మారుతీ సుజుకీ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ అమ్మకాలు 52 శాతం పడిపోయాయి. లాక్ డౌన్ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తమ ఉత్పత్తులు నిలిపివేశాయి. మారుతీ సుజుకీ తమ ఉత్పత్తులు మళ్లీ ప్రారంభమైతే ఉద్యోగుల సంఖ్యలో కోత విధించే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే సేల్స్ పెరుగుతాయని చెబుతున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications