Loan Fraud Case: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి ఏసీబీ భారీ షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రైడ్స్ చేపట్టింది. బ్యాంక్ మోసం కేసులో (Bank Fraud Case) రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు శనివారం సోదాలు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి అనిల్ అంబానీ ఇంటిపై సీబీఐ దాడులు చేస్తోంది. ఈ సోదాల్లో 7 నుంచి 8 మంది సీబీఐ అధికారులు పాల్గొన్నారు.
అధికారులు ఉదయం 7 నుండి 8 గంటల ప్రాంతంలో కఫ్ పరేడ్ సీవిండ్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో అనిల్ అంబానీ ఇంట్లోనే ఉన్నారు. గతంలో అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించిన సంగతి విదితమే. సీబీఐ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ ఇంట్లో, బ్యాంకు రుణ కేసుకు సంబంధించిన ఇతర ప్రదేశాలలో పత్రాలను పరిశీలిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి . యెస్ బ్యాంక్ , అనిల్ అంబానీ కంపెనీల మధ్య డబ్బు మార్పిడికి సంబంధించిన పత్రాల కోసం సీబీఐ వెతుకుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలతో సంబంధమున్న రూ.2 వేల కోట్ల మోసపూరిత ఎస్బీఐ రుణం కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), దాని అనుబంధ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను మోసపూరితంగా వినియోగించారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి విదిమే. అనిల్ అంబానీని ఫ్రాడ్‌గా గుర్తించినట్లు ప్రకటించిన ఎస్‌బీఐ తాజాగా సమర్పించిన ఫైలింగ్‌లో మొత్తం 31,580 కోట్ల రుణం తప్పుదోవ పట్టించారని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రుణంలో ఒక భాగాన్ని స్పష్టమైన నిబంధనల ప్రకారం వినియోగించాల్సి ఉన్నప్పటికీ, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని తాము గుర్తించామని తెలిపింది.
ముఖ్యంగా, రుణ చెల్లింపులకు కేటాయించాల్సిన రూ. 13,667.73 కోట్లలో కేవలం రూ.6,265.85 కోట్లు మాత్రమే వాడగా..కనెక్టెడ్ పార్టీల చెల్లింపుల కోసం ఉద్దేశించిన రూ. 12,692.31 కోట్లలో కేవలం రూ. 5,501.56 కోట్లు మాత్రమే వినియోగించారని ఎస్‌బీఐ ఆరోపించింది. ఈ గణాంకాలు ఆర్ధిక లావాదేవీల్లో గణనీయమైన లోపాలు ఉన్నట్లు చూపుతున్నాయని తెలిపింది. కేవలం రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రమే కాదు, అనిల్ అంబానీ నేతృత్వంలోని ఇతర సంస్థలు కూడా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డాయని సమాచారం వెలువడింది. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 250 కోట్లు..IIFCL నుంచి పొందిన రూ. 248 కోట్ల రుణం వినియోగంలోనూ ఇదే తరహా లోపాలు గుర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మొత్తం రుణ వ్యవహారాలన్నీ ప్రశ్నార్థకంగా మారాయి.
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఖాతా మోసంగా ప్రకటించబడితే 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించడంతో పాటు సీబీఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. ఈ ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే సీబీఐ అనిల్ అంబానీ ముంబై నివాసం, కార్యాలయాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. బ్యాంకు మోసం ఆరోపణలపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రమోటర్లపై శనివారం సీబీఐ కేసు నమోదు చేసి, ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిందని అధికారులు పిటిఐకి తెలిపారు.
దాదాపు రూ.17 వేల కోట్ల రుణ మోసం కేసులో జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి రిలయన్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ అనిల్ అంబానీని ప్రశ్నించడానికి ఈడీ రెండు వారాల క్రితం పిలిచింది. అంతకు ముందే, అనిల్ అంబానీకి సంబంధించిన వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు చేసింది. రిలయన్స్ గ్రూప్‌తో సంబంధం ఉన్న 50 వ్యాపార సంస్థలు, 25 మంది వ్యక్తులపై ఈడీ దాడులు చేసింది. జూలై 24న ముంబైలో కనీసం 35 చోట్ల ఈ దాడులు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
ED దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ధృవీకరించబడిన మూలాలు లేకుండా కంపెనీలకు రుణాలు జారీ చేయడం, ఒకే డైరెక్టర్, చిరునామా కలిగిన రుణం తీసుకునే సంస్థలు, రుణ ఫైళ్లలో అవసరమైన పత్రాలు లేకపోవడం, షెల్ కంపెనీల పేరుతో రుణాలను ఆమోదించడం, పాత రుణాలను తిరిగి చెల్లించడానికి కొత్త రుణాలు తీసుకోవడం మొదలైనవి ఉన్నాయి.
ఈ దాడికి ముందు సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఈడీ దాడులు నిర్వహించింది. ఇప్పుడు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది. 2017-2019 ఆర్థిక సంవత్సరం మధ్య యెస్ బ్యాంక్ ద్వారా అనిల్ అంబానీ కంపెనీలకు అక్రమంగా రుణంగా బదిలీ చేయబడిన రూ.17 వేల కోట్ల బ్యాంకు రుణ మోసానికి సంబంధించిన ఈ దాడి జరిగింది. ED వర్గాల సమాచారం ప్రకారం, అనిల్ అంబానీ కంపెనీలకు రుణం ఇవ్వడానికి ముందు, యెస్ బ్యాంక్ ప్రమోటర్లు తమ వ్యాపారంలో భారీ మొత్తంలో డబ్బును అందుకున్నారు. అందుకే లంచం, రెండింటి మధ్య సంబంధాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే రుణ చెల్లింపుల సమస్యల కారణంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ ఆరోపణలు అనిల్ అంబానీ ప్రతిష్ఠను మరింత దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications