For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Share: ఎల్ఐసీలో ఆవిరౌతున్న ఇన్వెస్టర్ల సంపద.. ఇప్పుడు షేర్లను ఉంచుకోవాలా.. అమ్మేయాలా..

|

LIC Share: దేశంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టారు. కానీ.. ఏమైందో ఏమో కానీ ఇది మరో పేటీఎం షేర్ లాగా పతనాన్ని కొనసాగిస్తోంది. ఈ తరుణంలో.. బిఎస్‌ఈలో గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) షేర్లు కొత్త కనిష్ఠ స్థాయి అయిన రూ.721కి పడిపోయింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన నాటి నుంచి షేర్ విలువ పడిపోతూనే ఉంది. రూ. 949 వద్ద ఉన్న IPO ధర.. ఇప్పటి వరకు 24% వరుకు విలువను కోల్పోయింది.

ఇదే సమయంలో కంపెనీ లిస్టింగ్ తరువాత రూ. 1.42 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. మెుత్తం 6 లక్షల కోట్ల మార్కెట్ విలువలో ఈ మెుత్తం ఆవిరైంది. ఇది జూన్ 9, 2022 నాటికి 4.57 లక్షల కోట్లకు తగ్గింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో షేర్ విలువ దాదాపు 11 శాతం పతనమైంది. అసలు ఈ షేర్లను ఉంచుకోవాలా.. లేక నష్టానికైనా వదిలించుకోవాలా అని చాలా మంది రిటైల్ పెట్టుబడి దారుల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 10 చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది, నిపుణులు ఈ షేర్ గురించి ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకోండి..

యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ గడువు ముగింపు:

యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ గడువు ముగింపు:

యాంకర్ ఇన్వెస్టర్‌లకు కేటాయించిన షేర్లపై తప్పనిసరి లాక్-ఇన్ గడువు ఉంటుంది. అయితే అది శుక్రవారం జూన్ 10తో ముగుస్తుంది. భారతదేశపు అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఇష్యూ మే 4-9 మధ్య తెరిచి ఉంది. మే 17న ఎన్‌ఎస్‌ఈ, బిఎస్‌ఈల్లో 8-9% తగ్గింపుతో షేర్లు ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యింది.లాక్ ఇన్ పరియడ్ తరువాత అతి పెద్ద పెడ్డుపడిదారులైన యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో తమ వాటాలను ఉపసంహరించుకుంటే అది షేర్ విలువపై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ తరుణంలో యాంకర్ పెట్టుబడిదారుల నిర్ణయం చాలా కీలకంగా మారనుంది.

ఎల్‌ఐసీ షేర్లపై నిపుణులు ఏమి అంటున్నారు ?

ఎల్‌ఐసీ షేర్లపై నిపుణులు ఏమి అంటున్నారు ?

ఇంతకుముందు.. మార్కెట్స్‌మోజో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సునీల్ దమానియా.. ప్రస్తుతానికి స్టాక్‌లో కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేయాలని సిఫార్సు చేశారు.ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని, కంపెనీ IPO తర్వాత ఎలా కరెక్షన్ కు గురైందో చూస్తే.., ఎల్ఐసీ షేర్ విలువ ప్రస్తుతం ఉన్న స్ఠాయి నుంచి ఇంకా పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అభిప్రాయాన్ని షేర్ విలువ రూ.800 కంటే దిగువకు పడిపోయినప్పుడు ఆయన వెల్లడించారు. స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా మంగళవారం మాట్లాడుతూ ఎల్‌ఐసీకి బలమైన బ్రాండ్ విలువ, భారీ ఏజెంట్ల నెట్‌వర్క్, ఆశించదగిన పంపిణీ నెట్‌వర్క్‌తో సహా అనేక పోటీ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం షేర్ మార్కెట్ విలువ వద్ద.. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని, బయ్ అట్ డిప్ వ్యూహాన్ని అనుసరించవచ్చని అన్నారు.

బ్రోకరేజీలు ఏమి చెబుతున్నాయి?

బ్రోకరేజీలు ఏమి చెబుతున్నాయి?

గ్లోబల్ రీసెర్చ్ సంస్థ ఎమ్కే ఎల్‌ఐసీపై హోల్డ్ రేటింగ్‌తో ఆర్జెట్ ధర రూ. 810తో కవరేజీని ప్రారంభించింది. బ్రోకరేజ్ హౌస్ ICICI సెక్యూరిటీస్ కూడా షేర్ పై పాజిటివ్ నోట్ కొనసాగిస్తోంది. కోవిడ్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ముఖ్యంగా ఏజెన్సీ ఛానెల్‌పై బలమైన పనితీరు ఉందని నొక్కి చెప్పింది.ఇదే సమయంలో.. 2022 జనవరి - ఫిబ్రవరిలో వ్యాపార ప్రీమియంలలో మ్యూట్ వృద్ధిని చూసిన తర్వాత, లైఫ్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో హీటీ రికవరీ ఉందని తాము విశ్వసిస్తున్నామని బ్రోకరేజ్ సంస్థ షేర్ఖాన్ పేర్కొంది. సప్లై-సైడ్ సమస్యలు తగ్గుముఖం పట్టడం, నాన్-పార్ & యాన్యుటీ విభాగాలు బలమైన వృద్ధిని సాధించే అవకాశం ఉన్నందున వ్యాపారం వేగం పుంజుకుంటుందని షేర్ఖాన్ సంస్థ అభిప్రాయపడింది.

English summary

LIC Share: ఎల్ఐసీలో ఆవిరౌతున్న ఇన్వెస్టర్ల సంపద.. ఇప్పుడు షేర్లను ఉంచుకోవాలా.. అమ్మేయాలా.. | lic price falling since listing evapurated market cap of 1.42 lakh crores of investors and anchor lock in ending on june 10th

lic share fell 24 percent from its listing price and anchor lock in ending on june 10th
Story first published: Thursday, June 9, 2022, 21:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X