ముంబై: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. ఈ రెండు దేశాలు ఢీ అంటే ఢీ అంటోన్నాయి. రష్యా సైనిక బలగాల దాడిని ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైనికులు చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాదాపుగా పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్, మెలిటొపొల్ నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి.

దూకుడు పెంచిన
ఖార్కీవ్‌లో అదే పరిస్థితి నెలకొంది. ఛెర్నిహివ్, మరియోపొల్ నగరాలను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టాయి. ఏ క్షణమైనా ఛెర్నిహివ్.. రష్యా వశం కావచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. పోర్ట్ సిటీ ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్‌పై రష్యా వైమానిక బలగాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. ఎనెర్హొడార్ సిటీలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని వశం చేసుకున్నాయి. ఇదో అతిపెద్ద విజయంగా భావిస్తోంది రష్యా.

యుద్ధం ఇప్పట్లో ఆగనట్టే..
ఈ పరిణామాలన్నీ- యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదనే సంకేతాలను పంపిస్తోన్నాయి. అమెరికా సహా యూరోపియన్ దేశాలన్నీ ఆర్థిక ఆంక్షలను విధించిప్పటికీ రష్యా ఏ మాత్రం లెక్కచేయట్లేదు. తన యుద్ధం తీవ్రతను మరింత పెంచింది. యుద్ధం దుష్ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపైనా పడుతోంది. క్రూడాయిల్ ధర కూడా ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరడం వల్ల.. దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం దాదాపుగా ఖాయమైనట్టే.

గ్లోబల్ స్టాక్స్‌పై
ఈ నెల 10వ తేదీన వెలువడనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. యుద్ధ ప్రభావం- అటు జీవిత బీమా సంస్థ మెగా పబ్లిక్ ఇనిషియల్ ఆఫరింగ్ (ఐపీఓ) జారీని కూడా అడ్డుకున్నట్టే కనిపిస్తోంది. యుద్ధం ఆరంభమైన తరువాత భారత్ సహా గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్నీ నెగెటివ్‌లో ట్రేడింగ్ అవుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎల్ఐసీ మెగా ఐపీఓను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయనుందనే వార్తలు వస్తోన్నాయి.

అన్నీ సవ్యంగా ఉంటే..
అన్నీ సవ్యంగా సాగివుంటే- ఈ పాటికి దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎల్ఐసీ మెగా ఐపీఓ జారీకి సంబంధించిన సందడి నెలకొని ఉండేదే. ఈ నెల 10వ తేదీ తరువాత ఎప్పుడైనా ఎల్ఐసీ ఐపీఓ షెడ్యూల్ వెలువడి ఉండేది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్స్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ వందల పాయింట్ల మేర నష్టపోతూ వస్తోన్నాయి.
ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఎల్ఐసీ ఐపీఓ జారీ చేయకూడదని- చివరి నిమిషంలో కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎల్ఐసీ ఐపీఓ జారీ తేదీని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పునఃసమీక్షించారు కూడా.

రూ.63,000 కోట్లు..
ఎల్ఐసీ ఐపీఓను జారీ చేయడం ద్వారా 63,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా ఈ నెల 31వ తేదీ నాటికి ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,75,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఎయిరిండియాను విక్రయించడం వల్ల వచ్చిన ఆదాయం 18,000 కోట్ల రూపాయలే.

వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే..
తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎల్ఐసీని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమ్మకానికి పెట్టాలని భావించింది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ- యుద్ధం వల్ల దీన్ని కాస్తా వాయిదా వేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ఐసీ ఐపీఓ షెడ్యూల్ ఇప్పుడు నిలిచిపోతే- ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే జారీ చేస్తుంది. రెండో త్రైమాసికంలో ఎల్ఐసీని ఐపీఓకు తీసుకెళ్తుందనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications