బంగారం ధరలపై లేటెస్ట్ న్యూస్ .. నేడు హైదరాబాద్ తోపాటు ప్రధాన నగరాల్లో ధరలిలా!!
కాస్త తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కాస్త బంగారం ధరలు తగ్గాయని ఉపశమనంగా ఫీలయిన బంగారం కొనుగోలుదారులు నేడు మళ్లీ బంగారం ధరలు పెరగడంతో ఈ పరిస్థితులు మారవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోవడం ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కనిపిస్తుంది.
నేడు దేశీయంగా బంగారం ధర 10గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 100రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 110 రూపాయలు మేర ధర పెరిగింది. ఇక నేడు బంగారం ధరలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎలా ఉన్నాయో చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలుగా విక్రయించబడుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 , 800 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 950 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 650 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ట్రేడవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, అనంతపురంలలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 650 రూపాయలు గా విక్రయించబడుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. బెంగళూర్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర నేడు 56,700 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ట్రేడవుతోంది.

దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, సేలం, ఈ రోడ్, తిరుపూర్, తిరునవ్వేలి, తిరుచ్చి లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57, 150 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62, 350 రూపాయలు గా ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications