No Income Tax: సహజంగా ప్రభుత్వాల ప్రజల నుంచి అనేక రూపాల్లో పన్నులు వసూలు చేస్తుంటాయి. వీటిలో డైరెక్ట్, ఇన్డైరెక్ట్ టాక్సులు ఉంటాయి. కొంత పరిమితికి మించి సంపాదన కలిగిన వ్యక్తుల నుంచి ప్రభుత్వాలు ఆదాయపు పన్ను వసూలు చేస్తుంటాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇలాంటి ఇబ్బందులు లేవు. ఇండియాలో అకౌంటింగ్ ఇయర్ చివరికి రావటంతో చాలా మంది తమ ఐటీఆర్ ఫైల్ చేసే పనిలో ఉన్నారు.

యూఏఈలో..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా అందమైన, సంపన్న దేశం. అక్కడి ప్రభుత్వం తన ప్రజలకు ఆర్థిక, విద్య, ఆరోగ్య పరంగా అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా చమురు, విదేశీ కంపెనీలపై వచ్చే కార్పొరేట్ పన్నులే. తన ప్రజల నుంచి యూఏఈ ప్రభుత్వం ఎలాంటి ఆదాయపు పన్నును వసూలు చేయటం లేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రశాతంగా, హాయిగా జీవిస్తున్నారు. వారు సంపాదించిన ధనాన్ని పూర్తిగా వారి అవసరాలకే వినియోగించుకుంటున్నారు.

మొనాకో..
ప్రపంచంలోని రెండవ అతి చిన్న దేశం మొనాకో. మధ్యధరా సముద్రంలో అత్యంత అందమైన దేశమిది. నివసించడానికి అత్యంత ఖరీదైన దేశాల్లో ఇది కూడా ఒకటి. అక్కడ ప్రజలు కొనుగోలు చేసే నిత్యవసర వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇతిచిన్న దేశంలో ప్రజలు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వెల్త్ టాక్స్ వంటి ఎలాంటి పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

ఖతార్..
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి దేశం ఖతార్. ఇక్కడ కూడా ప్రజలు తమ ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా వ్యక్తి ఏదైనా వ్యాపారం, స్థిరాస్తి విక్రయం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తే దానిపై ఖతార్ ప్రభుత్వానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

బహ్రెయిన్..
బహ్రెయిన్ 50 సహజ ద్వీపాలు మరియు 22 కృత్రిమ ద్వీపాలు, చమురు వనరులతో కూడిన ఒక చిన్న దేశం. ఇక్కడి ప్రజలు వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు మరియు స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ గ్యాస్ సెక్టార్‌లో నిర్వహించే వ్యాపారాలపై ఎక్కువ పన్ను విధించబడుతుంది.

బెర్ముడా..
మీరు బెర్ముడాలో స్థిరపడాలని ఆలోచిస్తున్నట్లయితే సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. దీనికి తోడు VAT, కార్పొరేట్ పన్నులు, సేల్స్ టాక్స్ ఈ దేశంలో చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యజమానులు పేరోల్ పన్నులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

కువైట్..
కువైట్ లో నివసించే వారు సైతం వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా కువైట్ నిలిచింది.

బహామాస్..
పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందిన దేశం బహామాస్. ఈ రంగం నుంచి ఆ దేశం అత్యధికంగా ఆదాయాన్ని గడిస్తోంది. అందువల్ల అక్కడ నివసించే వారి నుంచి ప్రభుత్వం ఎలాంటి ఆదాయపు పన్నును వసూలు చేయటం లేదు. దీనికి తోడు క్యాపిటల్ గెయిన్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే వారసత్వంగా వచ్చే ఆదాయంపై కూడా ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు.


Click it and Unblock the Notifications