న్యూఢిల్లీ: డిసెంబర్ నెల నుంచి టెలికం కంపెనీలు.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు వాయిస్ కాల్, డేటా టారిఫ్ పెంచనున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అదే మార్గంలో నడవనుంది. 2016లో జియో వచ్చినప్పటి నుంచి అతి చవక ధరలకే కాల్స్, డేటాలను కస్టమర్లు వినియోగిస్తున్నారు. ఇప్పుడు పెద్ద మొత్తంలోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: కస్టమర్లపై టారిఫ్ భారం.. ఇందుకే..

20 శాతం మేర పెరగొచ్చు
కస్టమర్లపై 20% వరకు ఛార్జీల భారాన్ని టెలికం సంస్థలు మోపనున్నాయని వార్తలు వస్తున్నాయి. AGR అంశంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో టెలికం కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడింది. వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపెనీలపై ఎక్కువ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి తమ టారిఫ్స్ పెంచనున్నట్లు అన్ని టెల్కోలు ప్రకటించాయి. తక్కువ రిచార్జ్ ప్లాన్స్‌పై పెద్దగా పెంపు ఉండకపోవచ్చునని వార్తలు వస్తున్నాయి. హై ప్లాన్స్ పై పెంపు ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో అన్ని ప్లాన్స్ రేట్లు 20% ఒకే విధంగా పెరగొచ్చు.

రూ.100 వరకు భారం పడవచ్చు..
ఈ పెంపు ప్రకారం సరాసరిన ఇప్పటి వరకు ఉన్న బిల్లులతో పోలిస్తే రూ.100 లోపు భారం ఉండవచ్చునని అంచనా. అదే సమయంలో ఆయా ప్లాన్‌లలో మరింత డేటా వినియోగించుకునే వెసులుబాటును టెల్కోలు కల్పించవచ్చు.

ఇంక్రిమెంటల్ బేసిస్ ఆధారంగా పెంపు
టెల్కోలు ఇంక్రిమెంటల్ బేసిస్ ప్రాతిపదికన టారిఫ్ పెంచవచ్చునని అంటున్నారు. ఎక్కువ ప్రణాళికకు ఎక్కువ.. తక్కువ ప్రణాళికకు తక్కువ మొత్తం పెరగవచ్చునని చెబుతున్నారు. ఇది 20 శాతం ఉండవచ్చునని అంటున్నారు.

'ప్రత్యేకం'పై టారిఫ్
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ప్లాన్ల ధరలు కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.10 వేల వరకు ఉన్నాయి. నెలసరి, దీర్ఘకాలిక వార్షిక ప్లాన్స్ ఉన్నాయి. పలు రకాల ప్లాన్స్ పైన మాత్రమే కాకుండా ప్రత్యేక డేటా వోచర్లకు టారిఫ్ పెంపు వర్తిస్తుంది. అలాగే అకౌంట్ బ్యాలెన్స్ ప్యాకేజీలకూ ఉండనుంది.

వీరికి భారమయ్యే అవకాశం
డేటా వోచర్స్, అకౌంట్ బ్యాలెన్స్ ప్యాక్స్‌పై టారిఫ్ పెంపు భారం ఎక్కువగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు భారంగా మారే అవకాశముంది.జియో ఇప్పటికే IUC పేరుతో ఇతర నెట్ వర్క్స్‌కు చేసే కాల్స్ పైన నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తోంది. ఇందుకు రూ.10 నుంచి టాప్ అప్స్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications