ఐటీ కంపెనీల్లో సగటు ఆట్రిషన్ (వలసలు) రేటు 17 శాతం గరిష్టానికి చేరుకుంది. అధిక వలసల రేటు నేపథ్యంలో ఐటీలో ఫ్రెషర్స్‌కు మరిన్ని అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల నుండి కూడా వలసల రేటు భారీగా పెరిగింది. ఐటీ రంగంలో వలసల రేటు పది శాతం నుండి పదిహేడు శాతానికి పెరిగింది.
మరిన్ని త్రైమాసికాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో వలసల రేటు పెరగడం, తద్వారా ఫ్రెషర్స్‌కు మరిన్ని ఉద్యోగ అవకాశాలు రావడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు.. ఇలా అన్ని నగరాల్లోను వలసల రేటు ఎక్కువగానే ఉంది.

ఉద్యోగుల వలసల రేటు
ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం వేగంగా పెరుగుతోంది. కరోనా పరిణామాల ప్రభావంతో, డిజిటల్ సేవల విస్తరణ పెరిగి ఐటీ కంపెనీలకు వినూత్న, భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ, ఏఐతో కూడిన ప్రాజెక్టులు పెరిగాయి. దీంతో ఆయా విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఐటీ రంగానికి లేదా కంపెనీలకు ఎక్కువగా అవసరం వస్తోంది. దీంతో ఇంజినీరింగ్, కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్లను ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అనుభవజ్ఞులైన లేదా నిపుణులైన ఉద్యోగులకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
పని చేస్తోన్న కంపెనీలో అయితే ఏడాదికి 5 శాతం నుండి 10 శాతం శాలరీ పెరుగుతుంది. కంపెనీ మారితే 20 శాతం నుండి 30 శాతం ఎక్కువ వేతనం వస్తోంది. కొన్ని కంపెనీలు యాభై శాతం వరకు కూడా ఇస్తున్నాయి. అధిక వేతనం ఇస్తుండటంతో కంపెనీలు మారడానికి ఎక్కువమంది ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువ అయినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఐటీ ఉద్యోగుల వలసల రేటు 17 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

వలసల రేటు ఎక్కువగా ఉంది
దేశీయంగా ఐటీ సేవల్లో ఉన్న దిగ్గజ కంపెనీల్లో వలసల రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే ఏడాది రెండేళ్ల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి రావొచ్చునని అంటున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో తమకు కేటాయించిన పని చేస్తూనే, ఇతర సమయంలో డిజిటల్ టెక్నాలజీల్లో కొత్త నైపుణ్యాలకు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటున్నారు. ఆన్ లైన్ ద్వారా కొత్త టెక్నాలజీని నేర్చుకొని, అధిక జీతభత్యాలు లభించే కంపెనీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎక్కువ వేతనం..
ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని నేర్చుకొని, ఎక్కువ వేతనం లభించే కంపెనీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇంజినీర్లు, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆటోమేషన్ విభాగాల్లో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు అధికంగా లభిస్తున్నాయి. ఈ నైపుణ్యాలు గల ఐటీ ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు



Click it and Unblock the Notifications