బంగారం కొనుగోలుకు ఇది సరైన సమయమేనా? తాజా ధరలపై నిపుణులు చెప్తుందిదే!!
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. బంగారం ధరలు తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ 62 వేలకు దూసుకుపోయాయి. రెండు రోజులు ధరలు పెరిగితే, రెండు రోజులు ధరలు తగ్గుతున్నట్టు ధరల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. అయితే ధరలు తగ్గుదల కంటే పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది.
తాజాగా ఇటీవల కాలంలో బంగారం ధరలు కాస్త ఎక్కువగానే తగ్గాయని చెప్పొచ్చు. ఇది బంగారం కొనుగోలుదారులకు ఊరట నిచ్చే అంశం. ఇక తాజాగా బంగారం ధరల విషయానికి వస్తే నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలుగా ట్రేడవుతోంది.

హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 330 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం లలో కూడా 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలుగా కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,450 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,480 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలుగా ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లో 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 55,300రూపాయలు కాగా, 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60,330రూపాయలుగా ట్రేడవుతోంది. శనివారం నాడు తగ్గిన ధరలు అప్పటినుంచి ఇప్పటివరకు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఒకే రోజులో ఏడు వందల రూపాయలకు పైగా బంగారం ధరలు తగ్గటం నిజంగా బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని, భవిష్యత్ లో మరింత బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు . మరి ఇంకెందుకు ఆలస్యం.. బంగారం షాపులకు వెళ్లి ఇష్టమైన బంగారు నగలను కొనుగోలు చేసుకోండి.


Click it and Unblock the Notifications