బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? లేటెస్ట్ బంగారం ధరలివే!!
భారతదేశంలో ప్రజలకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా మహిళలకు అయితే బంగారు ఆభరణాలు అంటే ఎనలేని మక్కువ. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు కొనుగోలు చేయలేనంత ఎక్కువగా పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 55 వేల 400 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 450 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. హైదరాబాదులో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 400 రూపాయలుగా, ఇక 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 60,450 రూపాయల వద్ద విక్రయించబడుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,550 రూపాయలుగా ట్రేడవుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 600 రూపాయలుగా ట్రేడవుతోంది.ముంబై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,450 రూపాయలుగా విక్రయించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, రాజమండ్రిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,450 రూపాయలుగా విక్రయించబడుతుంది.
చెన్నై లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 900 రూపాయలు కాగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,980 రూపాయలుగా విక్రయించబడుతుంది. రెండు నెలల క్రితంతో పోలిస్తే బంగారం ధరలు ప్రస్తుతం తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం స్వచ్చమైన బంగారం 61వేల రూపాయల లోపే ట్రేడ్ అవుతుంది. ఆర్నమెంట్ బంగారం 56వేల రూపాయల లోపే విక్రయించబడుతుంది. ఇక ప్రస్తుతం బంగారం కొనాలి అనుకునే వారు కొనుగోలు చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు.


Click it and Unblock the Notifications