కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవలి వరకు మూతబడిన కంపెనీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక వ్యవస్థలు మూతబడటం, లాక్ డౌన్ అనంతరం ఇప్పుడు తెరుచుకుంటున్నప్పటికీ ఎప్పటికి కోలుకుంటాయో తెలియని పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైనా కంపెనీ వేతనాలు పెంచినా లేదా కొత్తగా ఉద్యోగులను తీసుకుంటే అది వార్త అయి కూర్చుంటోంది. ఈ నేపత్యంలో ఇన్ఫోసిస్ నుండి ఓ గుడ్‌న్యూస్.

దాదాపు 18,000 మందిని తీసుకోవచ్చు
కరోనా మహమ్మారి కారణంగా డిమాండ్ తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లోను దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా తాము కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని తెలిపింది. ఈ ఏడాది ఎంతమందిని తీసుకుంటుందో చెప్పనప్పటికీ గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న ఉద్యోగాలతో సమానంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన ఇన్ఫోసిస్ గత ఏడాది 18,000 మంది ప్రెషర్స్‌కు ఆఫర్ లెటర్స్ పంపించింది. దాదాపు దానికి సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.

కాలేజీలతో మాట్లాడుతాం
వచ్చే ఏడాది చేరనున్న ఫ్రెషర్స్ కోసం కాలేజీలతో తాము మాట్లాడుతామని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. క్యాంపస్ ప్రోగ్రామ్స్‌కు వారు సిద్ధంగా ఉంటే, మేం మాట్లాడుతామని, రిమోట్ (ఆన్-బోర్డింగ్) వంటి కొత్త ప్రక్రియల ద్వారా తీసుకుంటామని తెలిపారు. గతంలో ఇచ్చిన ఆఫర్ లెటర్స్‌ను గౌరవిస్తామని కూడా చెప్పారు.

లోకల్ టాలెంట్
ఇన్ఫోసిస్‌లో గత ఏడాది టాప్ లెవల్, మీడియం లెవల్ ఉద్యోగులు తగ్గి, జూనియర్ లెవల్ ఉద్యోగులు పెరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, అమెరికా, యూరోపియన్ దేశాల్లో మాత్రం స్థానికులకు ఉద్యోగులు ఇచ్చే దిశగానే ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. క్లయింట్స్ నుండి అలాంటి డిమాండ్ ఉన్నందున లోకలైజేషన్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. స్థానికంగా డిమాండ్ ఉన్నంత వరకు లోకల్ టాలెంట్ అవసరమని అభిప్రాయపడ్డారు. రెండేళ్ల కింది వరకు తమ ఆట్రిషన్ 20 శాతానికి పైగా ఉందని, కరోనా కారణంగా గత ఏడాది చివరి క్వార్టర్‌లో 15 శాతంగా నమోదయిందని, ముందు ముందు ఇదే కరోనా వల్ల మరింత తగ్గవచ్చునని చెబుతోంది.


Click it and Unblock the Notifications