గత ఏడాది మందగమనం కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి కనిపించింది. దీంతో ఉద్యోగ కల్పనా వృద్ధిరేటు 2018-19 ఆర్థిక సంవత్సరం 3.8 శాతంతో పోలిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి పరిమితమైందని కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. అయితే ఉద్యోగాల మొత్తం సంఖ్య 48.32 లక్షల నుండి 50.02 లక్షలకు పెరిగినట్లు వెల్లడించింది. అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా వచ్చిన కొత్త ఉద్యోగాలు 1.70 లక్షలు మాత్రమే.

ఉద్యోగాల కోత
2018-19 ఆర్థిక సంవత్సరంలో 272 కంపెనీలు 1.18 లక్షల ఉద్యోగాల కోత విధిస్తే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 321 కంపెనీలు 1.13 లక్షల ఉద్యోగ కోత విధించాయి. అంతకుముందు ఏడాది కొత్తగా 1.76 లక్షల కోత్త ఉద్యోగాల కల్పనతో పోలిస్తే, గత ఏడాది 1.70 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని, అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే తక్కువ జరిగిందని కేర్ రేటింగ్స్ పేర్కొంది. గత ఏడాది మందగమనం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు కరోనా కారణంగా అంతకంటే ఎక్కువ ప్రభావంపడింది.

9 కంపెనీల్లో లక్షకు పైగా ఉద్యోగులు
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 కంపెనీలు1.41 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇందులో నాలుగు ఐటీ కంపెనీలు, నాలుగు బ్యాంకులు ఉండగా, రెండు ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయి.
- తొమ్మిది కంపెనీల్లో.. ఒక్కో కంపెనీలో లక్షకు పైగా ఉద్యోగులు ఉన్నారు.
- ఇందులో నాలుగు ఐటీ కంపెనీలే ఉండటం గమనార్హం. రెండు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నాయి. మిగతా మూడింటిలో ఒకటి ఆటో, ఒకటి ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో ఉండగా, మరొకటి ఇతర రంగాల్లో ఉంది.
- 7 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 50,000 నుండి 1 లక్ష వరకు ఉన్నాయి.
- 17 కంపెనీల్లో ఉద్యోగులు 25,000 నుండి 50,000 మధ్య ఉన్నారు.
- మొత్తంగా 33 కంపెనీల్లో హెడ్ కౌంట్ 25,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. మొత్తం ఎంప్లాయిమెంట్‌లో ఇది 57 శాతం.

ఈ రంగాల్లో వృద్ధి బాగుంది
- రంగాలవారీగా చూస్తే ఐటీ (23 శాతం), బ్యాంకింగ్(22 శాతం), ఆటో(9 శాతం), ఫైనాన్స్(7 శాతం) ఉండగా, ఈ నాలుగు రంగాల వాటానే 61 శాతంగా ఉంది.
- ఒకప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులతో టాప్ 1గా నిలిచిన టెక్స్‌టైల్స్ రంగం ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. దీని వాటా 2.4 శాతంగా ఉంది.
- పది రంగాల్లో హెడ్ కౌంట్ క్షీణిస్తోంది.
- 33 రంగాల్లో 11 విభాగాల్లో ఉద్యోగాల వృద్ధి సగటు 3.5 శాతం కంటే ఎక్కువగా ఉంది.
- ఎలక్ట్రికల్స్, ఆర్థికం, బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, మన్నికైన వినియోగ వస్తువుల, ట్రేడింగ్, కెమికల్స్, ఇనుము, ఉక్కు, రిటైల్, ఇన్సురెన్స్ రంగాల్లో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications