కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు గతంలో రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణీకులకు భారతీయ రైల్వే ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ నుండి ఆ తర్వాత రైళ్లలో ప్రయాణం చేసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన వారుకు శుభవార్త చెప్పారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రయాణీకులకు సంబంధిత టిక్కెట్లను రద్దు చేశామని, అలాగే ఆ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాలని నిర్ణయించినట్లు గోయల్ తెలిపారు.

టిక్కెట్లు రద్దు.. డబ్బులు వాపస్
ఈ మేరకు రైల్వే బోర్డు జూన్ 22వ తేదీన ఓ ఆర్డర్‌లో తెలిపింది. రెగ్యులర్ టైమ్ టేబుల్ రైళ్ల కోసం ఏప్రిల్ 14వ తేదీ లేదా అంతకుముందు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లను రద్దు చేసి, అందుకు చెల్లించిన ఛార్జీని తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ ఆర్డర్‌లో పేర్కొంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నాటి నుండి మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను అన్నింటిని నిలిపివేసింది.

బుకింగ్స్ నిలిపివేతకు ముందు..
ఏప్రిల్ 15వ తేదీ నుండి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. అంతకుముందే మార్చి 25 నుండి రైళ్ల సర్వీసులు నిలిపివేసినందున, ఆయా రైళ్లకు చెందిన రిజర్వేషన్లను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ నుండి 120 రోజుల అనంతరం ప్రయాణించేందుకు ఉద్దేశించిన అన్ని టిక్కెట్లకు గాను ప్రయాణీకులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని రైల్వే శాఖ తెలిపింది. లాక్ డౌన్ సమయంలో జూన్ నెలకు గాను బుకింగ్ సౌకర్యం ఉంది.

అత్యవసరం కోసం రైళ్లు
కాగా, ప్రస్తుతం అత్యవసర ప్రయాణాల కోసం రైల్వే వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం, యాత్రికుల కోసం, విద్యార్థులు తదితరుల కోసం రైల్వేలు మే 1వ తేదీ నుండి శ్రామిస్ స్పెషల్ రైళ్లను ప్రవేశ పెట్టాయి.రైల్వే శాఖ మే 12వ తేదీ నుండి 30 ప్రత్యేక ఏసీ రైళ్లను ప్రారంభించింది. జూన్ 1వ తేదీ నుండి మరో 200 టైమ్ టేబుల్డ్ రైళ్లను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications