ఇండియా భవిష్యత్తు బాగుంటుంది, 25% మంది వేతనం తగ్గింది, మంచి ఛాన్స్: సర్వే
కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్‌లో ఉంది. ఈ మహమ్మారి వల్ల ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. కోట్లాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళన నెలకొంది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వేతనాల కోత ఓ అంశమైతే, కరోనా తర్వాత కొన్ని రంగాల్లో ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో లింక్డిన్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారత వృత్తి నిపుణులు భవిష్యత్తుపై ధీమాగా ఉన్నట్లు తెలిపింది.

షార్ట్ టర్మ్‌పై ఆందోళన
షార్ట్ టర్మ్‌లో ఉద్యోగావకాశాలు, కంపెనీల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు లింక్డిన్ సర్వే నివేదిక తెలిపింది. ఈ నెల తొలి వారానికి (1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు) భారత్‌కు సంబంధించి లింక్డిన్ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ స్కోర్ 53గా నమోదయింది.

భవిష్యత్తు బాగుంటుంది
భారత వృత్తి నిపుణుల్లో 50 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తమ వృత్తి జీవితంలో ప్రగతి ఉంటుందని ప్రతి అయిదుమందిలో ముగ్గురు నిపుణులు చెప్పారు. షార్ట్ టర్మ్‌ను పక్కన పెడితే దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వంపై ఆశావాహంగా ఉన్నారు. రానున్న రెండేళ్లలో తమ కంపెనీలు తిరిగి పుంజుతుంటాయని 72 శాతం మంది చెప్పారు.

వర్క్ ఫర్మ్ హోమ్ మంచి అవకాశం
రానున్న రెండు వారాల్లో ఉద్యోగాల కోసం వెతికే సమయం పెరుగుతుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. వచ్చే రెండు వారాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నందున కొత్త అంశాలు నేర్చుకోవడానికి ఉపకరిస్తుందని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆదాయం తగ్గింది
ఆదాయం తగ్గిందని 25 శాతం మంది చెప్పగా, వ్యక్తిగత వ్యయం తగ్గినట్లు 42 శాతం, పెట్టుబడులు తగ్గినట్లు 31 శాతం మంది చెప్పారు. ఇదిలా ఉండగా సీనియర్ మేనేజ్‌మెంట్‌లో మాత్రం వచ్చే ఆరు నెలలు గడ్డుకాలమేనని 33 శాతం మంది చెప్పారు.వచ్చే రెండేళ్లలో వృద్ధఇపై 69 శాతం మంది ధీమాగా ఉన్నారు.

కంపెనీల మద్దతు
ఫిజికల్ హెల్త్ పైన తమ కంపెనీ నుండి మద్దతు ఉందని 24 శాతం మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ మాత్రమే చెప్పారు. 22 శాతం మంది మద్దతు పొందుతున్నారు. లింక్డిన్ వర్క్ ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఆన్ లైన్ సర్వే ద్వారా ఈ వివరాలు సేకరించింది. జాబ్ మార్కెట్, వారి ఆర్థిక పరిస్థితి, కెరీర్ పురోగతి తదితర అంశాలపై మైనస్ 100 నుండి 100 వరకు పాయింట్లు ఇచ్చింది.


Click it and Unblock the Notifications