Gold News: కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకునే క్రమంలో బంగారం దిగుమతులపై ఓ కన్నేసి ఉంచుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి గోల్డ్ ఆర్నమెంట్స్ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది.
అవసరం లేని వస్తువుల దిగుమతిని తగ్గించేందుకు కేంద్రం కొన్ని బంగారు ఆభరణాలు, వస్తువులపై దిగుమతి పరిమితులను పెంచేసింది. తాజా నిర్ణయం తర్వాత కొన్ని బంగారు వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి లేదా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే భారత్-UAE CEPA TRQ క్రింద ఎటువంటి దిగుమతి లైసెన్స్ లేకుండానే ఉచితంగా దిగుమతులు అనుమతించబడతాయని DGFT తెలిపింది. అలాగే భారత్-ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇండోనేషియా నుంచి దిగుమతులు పెరగడంతో కొత్త ఆంక్షలు విధించబడ్డాయి. ఇందులో కొన్ని గోల్డ్ వస్తువులు టాక్స్ లేకుండా వస్తాయి. ఆభరణాలను తయారు చేయడానికి భారతదేశంలో వాటిని తిరిగి వ్యాపారులు కరిగిస్తారని తెలుస్తోంది.
కొత్త ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో ఇండియా 112.09 మిలియన్ డాలర్లు విలువైన గోల్డ్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో 76.28 మిలియన్ డాలర్లు ఇండోనేషియా నుంచి వచ్చాయి. ఈ దిగుమతులపై 15 శాతం సుంకం విధించబడింది. ఇండోనేషియా ఇండియాకు గోల్డ్ సరఫరాదారు కానప్పటికీ.. గత కొన్ని నెలలుగా ఇక్కడి బులియన్ ట్రేడర్లు ఎటువంటి దిగుమతి పన్నులు చెల్లించకుండా 3-4 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నట్లు ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ బులియన్ దిగుమతి బ్యాంకు డీలర్ వెల్లడించారు.
లొసుగులను వినియోగించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో విలువైన రాళ్లు, ముత్యాల దిగుమతి 25.36 శాతం మేర తగ్గింది. అలాగే గోల్డ్ దిగుమతులు సైతం 40 శాతం మేర క్షీణించాయి.


Click it and Unblock the Notifications