దేశవ్యాప్తంగా విస్తరించిన స్వచ్ఛంద సంస్ధలకు అందుతున్న విరాళాల విషయంలో నిఘాను మరింత పెంచేందుకు కేంద్రం సిద్ధమైంది. సాధారణ బడ్జెట్‌కు ముందే స్వచ్ఛంద సంస్దళకు అందుతున్న విదేశీ విరాళాలను లెక్క తేల్చేందుకు, వాటిపై మరింత నిఘా పెట్టేందుకు బ్యాంకుల సాయంతో కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్ధలకు వచ్చే నిధుల మూలాలను వెతికేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ బ్యాంకులకు తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత కరెన్సీలో కుప్పలు తెప్పలుగా వచ్చిన విదేశీ విరాళాల గుర్తింపులో ఈ మార్గదర్శకాలు కీలకం కానున్నాయి.

ఎన్జీవోలకు విరాళాలపై కేంద్రం దృష్టి
దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్ధలకు అందుతున్న విదేశీ విరాళాల విషయంలో ప్రస్తుతం కేంద్రం కొన్ని మార్పులు చేస్తోంది. ఇప్పటివరకూ ఆయా స్వచ్ఛంద సంస్ధలు కానీ, వాటి ఖాతాలు నిర్వహిస్తున్న బ్యాంకులు కానీ తమకు అందిన విరాళాలపై, వాటి వినియోగంపై కేంద్రానికి 48 గంటల్లో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంటుంది. అయితే ఈ లెక్కల్లో లొసుగులతో దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతోందని, అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దారి మళ్లుతున్నాయని కేంద్రం అనుమానిస్తోంది.

గత సెప్టెంబర్‌లో ఎఫ్‌సీఆర్‌ఏ చట్ట సవరణ
దేశంలో స్వచ్ఛంద సంస్ధలకు విదేశాల నుంచి అందుతున్న విరాళాలు మన దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడరాదని, దేశ భద్రతకు అవి ప్రమాదకరంగా మారకూడదని కేంద్రం భావిస్తోంది. దీంతో గతేడాది సెప్టెంబర్‌లో పార్లమెంటులో విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు చేశారు. వీటి ప్రకారం దేశంలో ఉన్న స్వచ్ఛంద సంస్దల్లో విదేశీ విరాళాలు పొందుతున్న వారు కచ్చితంగా ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తప్పనిసరిగా ఖాతా తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారానే సదరు ఎన్జీవోలు అన్ని లావాదేవీలు చేయాలని సూచించింది.

ఎన్జీవోలకు ప్రత్యేక ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతా
దేశంలోని స్వచ్ఛంద సంస్ధలు విదేశీ విరాళాలు పొందుతున్నట్లయితే ఈ ఏడాది మార్చి 31లోగా ఢిల్లీలోని ప్రత్యేక ఎస్‌భీఐ బ్రాంచ్‌లో ఖాతా తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతా కలిగిన స్వచ్ఛంద సంస్ధలు కూడా ఢిల్లీలోని ప్రత్యేక ఎఫ్‌సీఆర్‌ఏ బ్రాంచ్‌లో తమ ఖాతాలను లింక్ చేసుకోవాలని చట్టంలో చేసిన తాజా మార్పులు చెబుతున్నాయి. దీంతో కేంద్రం నిర్ణీత గడువులోగా విదేశీ విరాళాలు పొందుతున్న స్వచ్ఛంద సంస్ధలన్నీ ఈ మార్పులను అమలు చేసేలా ఒత్తిడి చేస్తోంది.

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
కేంద్రం కొత్తగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో తెచ్చిన మార్పులు కచ్చితంగా అమలు చేయాలని ఇటు బ్యాంకులకూ, అటు స్వచ్చంద సంస్ధలనూ కోరుతోంది. వాటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హోంశాఖ తాజా మార్గదర్శకాల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రకారం ప్రతీ బ్యాంకు కూడా భారతీయ కరెన్సీలో జమ అయ్యే నిధుల మూలాలు విదేశాల్లో ఉన్నా, దేశంలోనే ఉన్నా వాటిని కేంద్రం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే బ్యాంకులు, ఎన్జీవోలపైనా చర్యలు తప్పవని చెబుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనతో పాటు గతంలో జరిగిన పలు ఘటనల్లో ఎన్జీవోలకు అందిన విదేశీ విరాళాలే కీలకమని జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్‌ఐఏ గుర్తించిన నేపథ్యంలో హోంశాఖ తాజా మార్గదర్శకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications