ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) 2021 ప్రకారం అక్రిడిటేషన్ సిస్టమ్ లో భారత్ ప్రపంచంలోని ఐదవ-అత్యుత్తమ దేశంగా స్థానం దక్కించుకుంది. మొత్తం 184 దేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రా ఇండెక్స్ ఈ ర్యాంకులు విడుదల చేసింది. మౌలిక సదుపాయాల నాణ్యతపై ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ప్రపంచంలోని మొదటి ఐదు అక్రిడిటేషన్ సిస్టమ్‌లలో భారత్ ను ఒకటిగా గుర్తించబడటం గర్వంగా ఉందని పేర్కొంది.
ఇది మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో సహకారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. ప్రపంచంలోని మొదటి 25 దేశాల్లో ప్రధానంగా ఆసియా-పసిఫిక్, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు. ఈ జాబితాలో భారత్ కంటే జర్మనీ, అమెరికా, చైనా, ఇటలీ ఉన్నాయి. జర్మనీ అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీ నాలుగో స్థానంలో ఉంది. చైనా మూడో స్థానంలో ఉంది. అమెరికా 2వ స్థానంలో ఉంది.

QCI అనేది భారత్ లో అక్రిడిటేషన్‌ను నిర్వహించే సంస్థ. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ వాణిజ్య సంఘంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలు ముఖ్యమైనవి. ఇది వ్యాపార భాగస్వాముల మధ్య భద్రత, విశ్వసనీయతను పెంచడంలో సహాయపడతాయి. వివిధ వనరుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా GQII ర్యాంకింగ్స్ ఇస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications