Covid 19: లాక్‌డౌన్, తమ పిల్లల్ని తీసుకువచ్చేందుకు లక్షలు ఖర్చు చేశారు

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో రవాణా స్తంభించిపోయింది. ప్రజలు ఎక్కడికి అక్కడే ఆగిపోయారు. ఈ మహమ్మారి కారణంగా దేశదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. విమానయాన సేవలు నిలిచిపోయాయి. అయితే అంతకుముందే దేశంలోని కుబేరులు విదేశాల్లోని తమ పిల్లలను తీసుకు రావడానికి ప్రత్యేక లగ్జరీ విమానాలు ఉపయోగించారు. విదేశాల్లో చదువుతున్న తమ వారిని తీసుకు రావడానికి ప్రయివేటు జెట్లను ఆశ్రయించారు.

ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

మార్చి 16న ఫాల్కన్ 2000 జెట్ ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అందులో నుండి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిద్దరు కూడా వ్యాపార కుటుంబానికి చెందిన వారి పిల్లలు. వారు లండన్ నుండి వచ్చారు. వీరిద్దరు కూడా వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. వారిని లండన్ విమానాశ్రయానికి తరలించారు. ఈ ఇద్దరు యువతుల తల్లిదండ్రులు లండన్ నుండి ముంబైకి ప్రత్యేక జెట్‌లో తమ పిల్లలు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎంత ఖర్చయిందో తెలుసా?

ఎంత ఖర్చయిందో తెలుసా?

తమ ఇద్దరు పిల్లల్ని తీసుకు రావడానికి ప్రయివేటు జెట్ కోసం వారు ఎంత ఖర్చు చేశారో తెలుసా? రూ.90 లక్షలకు పైగా ఖర్చు చేశారట. వీరిద్దరే కాదు.. మార్చి 8వ తేదీ నుండి మార్చి 21వ తేదీ మధ్య చాలామంది కుబేరులు తమ పిల్లల్ని తీసుకు రావడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారట.

విమానయానం సంస్థలు నిలిపివేయవచ్చునని..

విమానయానం సంస్థలు నిలిపివేయవచ్చునని..

కరోనా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఎప్పుడైనా నిలిపివేయవచ్చుననే సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చదువుతున్న తమ పిల్లల్ని ధనవంతులు ప్రత్యేక జెట్ ఏర్పాటు చేసి తీసుకువచ్చారు.

ప్రయివేటు జెట్స్

ప్రయివేటు జెట్స్

అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేయడానికి ముందు దాదాపు 102 ప్రయివేటు చాప్టర్స్ ద్వారా యూకే, యూరోప్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ తదితర దేశాల్లోని విశ్వవిద్యాలయాల నుండి తమ పిల్లల్ని వెనక్కి తీసుకు వచ్చారు. దీనికి టాప్ ఎండ్ జెట్స్ డసాల్ట్ ఫాల్కన్ 2000, బోంబార్డియర్ ఛాలెంజర్ సిరీస్, హాకర్ బిజినెస్ ఎయిర్ క్రాఫ్టర్ వంటివి ఉపయోగించారు. వీటన్నింటిని కూడా ఒకే ఏవియేషన్ ఫర్మ్ నిర్వహించింది.

1 నుండి ముగ్గురు ప్రయాణీకులు

1 నుండి ముగ్గురు ప్రయాణీకులు

31 బిజినెస్ జెట్ విమానాలు పెద్దవారిని, ముఖ్యంగా వ్యాపారవేత్తల తల్లిదండ్రులను వెనక్కి తీసుకువచ్చాయి. ఢిల్లీ, ముంబై తదితర టైర్ వన్, టైర్ 2 వంటి నగరాలకు తీసుకువచ్చాయి. ఇందులో 85 శాతం విమానాలు కూడా కేవలం 1 నుండి ముగ్గురు ప్రయాణీకులను మాత్రమే తీసుకు వచ్చాయని జెట్ సెట్ గో ఫౌండర్ కనికా టెక్రీవాల్ అన్నారు.

విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి

విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి

లాక్ డౌన్ కారణంగా విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. టెక్రీవాల్ జెట్ సెట్ గోకు 346 ప్రీ బుక్డ్ లగ్జరీ జెట్ ఫ్లయిట్లు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో దాదాపు రూ.100 కోట్ల నష్టం ఉంటుందని అంచనా. అన్ని విమానయాన సంస్థలు కూడా వేల కోట్లు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ విమానాలను ఏప్రిల్ 14వ తేదీ వరకు రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+