కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వరుసగా లాక్ డౌన్‌ను కొనసాగిస్తున్నారు. తొలుత ఏప్రిల్ 14 వరకు, రెండో విడత మే 3 వరకు, మూడో విడత మే 17 (లాక్ డౌన్ 3.0 వరకు కొనసాగించారు. లాక్ డౌన్ 3.0 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకి మరింత ప్రమాదమని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎకానమీ అండ్ ఇండస్ట్రీపై కరోనా ప్రభావంపై CII సీఈవోలు అంచనా వేశారు.

ఆదాయం ఎంత తగ్గుతుందంటే
వరుసగా మూడోసారి లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించడంతో పాటు ఆర్థిక పునరుజ్జీవానికి కనీసం ఏడాది పట్టవచ్చునని అంచనా వేశారు. ఈ సర్వేలో 300 మందికి పైగా సీఈవోల పాల్గొన్నారు. ఇందులో మూడింట రెండొంతుల మంది MSMEలకు చెందినవారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆదాయం 40 శాతానికి రెవెన్యూ పడిపోతుందని 65 శాతం మంది భావించారు. 33 శాతం సంస్థలు 40 శాతం ఆదాయం పడిపోతుందని, 32 శాతం సంస్థలు 20 శాతం నుండి 40 శాతం ఆదాయం తగ్గుతుందని అంచనా వేశాయి.

కోలుకోవడానికి ఏడాది
ఒక నెల క్రితం సీఐఐ నిర్వహించిన ఇదే స్నాప్ పోల్‌లో ఆదాయాలు 10 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. ఇప్పుడు ఈ ఆదాయాలు 40 శాతం తగ్గుతాయని ఎక్కువ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రతి నాలుగు సంస్థల్లో మూడు కార్యాలయాలు క్లోజ్ అయి ఉన్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అవరోధంగా చెబుతున్నారు. ఓపెన్ చేసి ఉన్న వాటికి కూడా ఉత్పత్తులు లేక గిరాకీ లేదని చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కనీసం ఏడాది పడుతుందని సీఈవోలు అభిప్రాయపడ్డారు.

దేశీయ డిమాండ్ కంటే..
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చునని 45 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. త్వరగా కోలుకుంటాయని 34 శాతం మంది చెప్పారు. అంటే 6 నెలల నుండి 12 నెలల్లో కోలుకుంటాయని అభిప్రాయపడ్డారు. తమ ఉత్పత్తులకు సంబంధించి దేశీయ డిమాండ్ కంటే విదేశీ డిమాండ్ త్వరగా రికవరీ అయ్యే అవకాశముందని చెప్పారు.

ఉద్యోగ నష్టాల అంచనా
లాక్ డౌన్ ముగిసిన తర్వాత కంపెనీల్లో ఉద్యోగ నష్టాలు ఉంటాయని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోత 15 శాతం నుండి 30 శాతం ఉండవచ్చునని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో మూడింట రెండొంతుల మంది తమ సంస్థలలో ఇప్పటి వరకు అయితే ఉద్యోగాల కోత లేదా వేతన కోత లేదని చెప్పారు.

భారీ ఉద్దీపన అవసరం
సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ పరిశ్రమకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ కచ్చితంగా అవసరమేనని, దీంతో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని, కాబట్టి ఆర్థిక పునరుజ్జీవం కోసం ఉద్దీపన ప్యాకేజీ అవసరమని చెప్పారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications