భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి రావడంతో ఘర్షణ చోటు చేసుకొని 20 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా పెద్ద మొత్తంలోనే నష్టం జరిగినట్లగా వార్తలు వచ్చాయి. చైనా దుందుడుకుతనాన్ని జీర్ణించుకోలేని భారతీయులు చాలామంది చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రజలే కాదు ట్రేడర్స్ కూడా డ్రాగన్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలని చెబుతూ బహిష్కరించాల్సిన 500 వస్తువుల జాబితాను విడుదల చేసింది.

బహిష్కరించాలని కోరిన జాబితాలో ఇవి
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) నిన్న మేడిన్ చైనాకు చెందిన 500 వస్తువులను విడుదల చేసింది. వీటిని ఎవరు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేసింది. బహిష్కరించాలని కోరిన వాటిలో బొమ్మలు, ఫ్యాబ్రిక్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్స్, రోజూ వినియోగించే వస్తువులు, కిచెన్ ఐటమ్స్, ఫర్నీచర్, హార్డ్‌వేర్, ఫుట్‌వవేర్, హ్యాండ్ బ్యాంగ్స్, లగేజీ, ఎలక్ట్రానిక్స్, కాస్మోటిక్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, వాచీలు, రత్నాలు, ఆభరణాలు ఉన్నాయి. స్టేషనరీ, గృహోపకరణాలు, లైటింగ్, ఆరోగ్య ఉత్పత్తులు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, నూలు, ఫెంగ్ షుయ్ వస్తువులు, దీపావళి, హోళీ వస్తువులు, కళ్లజోడ్లు కూడా ఉన్నాయి.

భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా
లడక్ ప్రాంతాల్లో చైనా వైఖరి భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగ ఉందని ట్రేడర్స్ బాడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా చైనా వస్తువులను దూరం పెట్టాలని చెబుదతూ 'భారత వస్తువులు.. మనకు గర్వకారణం' అనే ప్రచారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా 500కు పైగా చైనా వస్తువులను బహిష్కరించాలని కోరింది.

70 బిలియన్ డాలర్ల దిగుమతులు
చైనా నుండి ప్రతి సంవత్సరం ఇండియాకు రూ.5.25 లక్షల కోట్లు (70 బిలియన్ డాలర్లు) విలువైన వస్తువులు దిగుమతి అవుతున్నాయి. 2021 డిసెంబర్ నాటికి చైనా తుది వస్తువుల దిగుమతిని 13 బిలియన్ డాలర్లు లేదా రూ.1 లక్ష కోట్లకు తగ్గించడమే లక్ష్యమని CAIT తెలిపింది. లక్ష కోట్లకు పైగా విలువైన చైనా దిగుమతులకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్యమ లక్ష్యమని తెలిపింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications