భారత ఎగుమతులు తొలిసారి ఒక ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు లేదా రూ.30 లక్షల కోట్ల మార్కును దాటాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, రత్నాభరణాలు, రసాయనాల రంగాలు రాణించడంతో ఇది సాధ్యమైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మార్చి 21వ తేదీ నాటికి మర్చండైజ్ ఎగుమతులు 37 శాతం వృద్ధి మోదు చేసి 400.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 330.07 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఇప్పటి వరకు గరిష్టం.
2020-21 ఆర్థిక సంవత్సరంలో 292 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 589 బిలియన్ డాలర్లు లేదా 44 లక్షల కోట్లకు పైగా చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 189 బిలియన్ డాలర్లు లేదా 14 లక్షల కోట్లుగా నమోదయింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్రం ఎగుమతుల లక్ష్యాన్ని అనుకున్న దాని కంటే ముందుగానే సాధించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి ప్రతినెల సరాసరిగా 3,300 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఒక రోజు సగటు 100 కోట్ల డాలర్లకు పైగా ఎగుమతి అయ్యాయి. పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, తోలు, కాఫీ, ప్లాస్టిక్ ఉత్పత్తులతోపాటు రెడీమేడ్ వస్త్రాలు, మాంసం, పాల ఉత్పత్తులు, పొగాకు రంగాలు ఎగుమతుల వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. 400 డాలర్ల వార్షిక ఎగుమతులు అసాధారణ విజయమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. కంటైనర్ల కొరతకు తోడు ట్రాన్సుపోర్ట్ ఛార్జీలు పెరగడంతో ఈసారి ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11,000 కోట్ల డాలర్లు పెరిగినట్లు తెలిపారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications