మళ్ళీ బంగారం ధరాఘాతం: నేడు బంగారం ధరలు తెలుగురాష్ట్రాల్లో ఎంత పెరిగాయంటే!!
భారతదేశంలో బంగారం ధరలు బాగా తగ్గితే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తున్న బంగారం కొనుగోలుదారులకు నిరాశ మిగులుతుంది. ఒక్కరోజులో బంగారం ధర వంద రూపాయలు తగ్గితే ఎనిమిది వందల రూపాయల వరకూ రూపాయలు పెరగడం ధరలు అదుపులోకి రాకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది.
ఇక నిన్న మొన్న కొంచెం బంగారం ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే, మళ్లీ బంగారం ధరల పెరుగుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ప్రధాన కారణమని తెలుస్తుంది.ఇక తాజాగా దేశీయంగా నేడు బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి వంద రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి నూట పది రూపాయల మేర బంగారం ధర పెరిగింది.

హైదరాబాద్ లో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,750 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 910 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 900 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,060 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,750 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 , 910 రూపాయలు గా ప్రస్తుతం విక్రయించబడుతుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 56,750 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,910 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.బంగారం ధరల్లో నిత్యం ఊగిసలాట కొనసాగడంతో బంగారం కొనుగోలుదారులు అంతగా బంగారం కొనుగోలు పై ఆసక్తి చూపించని పరిస్థితి నెలకొంది.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం కొనుగోలు తగ్గుతున్నట్లుగా కనిపిస్తుంది. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు, కిందికి దిగి వస్తే తప్పా మళ్లీ బంగారం కొనుగోలు కొనుగోళ్ల దూకుడు కొనసాగేలా కనిపించడం లేదు. అప్పటివరకు రోజూ బంగారం ధరలను చూసి దిగాలు పడటం తప్ప సామాన్య, మధ్యతరగతి ప్రజలు చేసేది ఏమీ లేదు.


Click it and Unblock the Notifications