ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇటీవల గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఐటీ రిటర్న్స్ గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. కొత్త ఐటీ వెబ్ సైట్‌లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సిద్ధం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఐటీ వెబ్ సైట్ సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో, పదిహేను రోజుల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీ నాటికి కోట్లాది మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించే అవకాశముంది.
ఒకటి రెండు రోజుల్లో
ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఓ ప్రకటన రావొచ్చునని, ఇప్పటికే సాంకేతిక సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయని, కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి మరింత సమయం కావడానికి గడువు పొడిగింపు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ఇబ్బందులు రాకుండా గడువు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత నాలుగు రోజుల్లో 4 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని, ఆగస్ట్ 21వ తేదీ నుండి వరుసగా రెండు రోజులు పని చేయలేదని చెప్పారు. FY21కు సంబంధించి 80 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని, FY20తో పోలిస్తే ఇది 14 శాతమని తెలిపారు. కొత్త పోర్టల్‌లో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు సంబంధించి రోజువారీ డేటాతో సీబీడీటీ ముందుకు రానుందని తెలుస్తోంది.

నిర్మలమ్మ గడువు... సూచనలు
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ సాంకేతిక సమస్యలను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు ఇటీవల సూచించారు. ఈ సాంకేతిక ఇబ్బందుల పైన ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి, ఆందోళనను తెలియజేసింది. అన్ని సాఫ్టువేర్ ఇబ్బందులు తొలగించేందుకు ఇరవై రోజులకు పైగా గడువును ఇచ్చింది. కొత్త ఐటీ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను చర్చించేందుకు గత సోమవారం సలీల్ పరేఖ్‌తో సమావేశమయ్యారు నిర్మలమ్మ. ఈ వెబ్ సైట్ జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుండి రూ.4241 కోట్లు ఖర్చు చేశామని, నాటి నుండి నేటి వరకు సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండున్నర నెలలుగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు తమ టీం ప్రయత్నిస్తోందని సలీల్ పరేఖ్ చెప్పారు. 750 మందికి పైగా సిబ్బంది ఐటీ శాఖ వెబ్ సైట్ పైన పని చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో ప్రవీణ్ రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు సలీల్ పరేఖ్.
సూచనలు...
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో రెండున్నర నెలలుగా సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ గడువును మళ్లీ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఐటీ రిటర్న్స్ గడువు జూలై 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే వివిధ అంశాల నేపథ్యంలో గడువును సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించారు. కొత్త పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నందున, ట్యాక్స్ పేయర్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నందున మరోసారి పొడిగించవచ్చునని నిపుణులు కూడా భావిస్తున్నారు. ఆదాయపుపన్ను శాఖ చివరకు కొత్త ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను అంగీకరించిందని, ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని ప్రముఖ జీఎస్టీ కన్సల్టెంట్ దివ్యేష్ జైన్ ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గడువు పొడిగించాలని కోరారు.
మరో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ చిరాగ్ చౌహాన్ కూడా ఓ ట్వీట్ చేశారు. గతంలో టీసీఎస్ సంస్థ ఎంసీఏను బాగా హ్యాండ్లింగ్ చేసిందని, ప్రస్తుతం పాస్ పోర్ట్ ఆపరేషన్స్‌ను బాగా నిర్వహిస్తోందని చెబుతూ, కొత్త ట్యాక్స్ పోర్టల్ అసైన్‌ను టీసీఎస్‌కు హ్యాండిల్ చేసి, ఏడాది సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, పాత ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలని పేర్కొన్నారు. దివ్యేష్ జైన్ ఈ ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేస్తూ, పాత ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలన్నారు.
ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ సాంకేతిక సమస్యలకు ఇన్ఫోసిస్‌తో పాటు ఆదాయపు పన్ను శాఖ కూడా సమానమైన బాధ్యత వహించాలని కూడా సీఏ చిరాగ్ చౌహాన్ సూచించారు. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుండి ఒక్కరోజుకు తగ్గించడం, రీఫండ్స్ వేగవంతం చేయడమే లక్ష్యంగా కొత్త ఐటీ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ కొత్త పోర్టల్ అభివృద్ధికి కేంద్రం రెండేళ్ల క్రితం రూ.4వేల కోట్లకు పైగా ఫండ్స్‌కు ఆమోదం తెలిపింది. జూన్ వరకు రూ.164.5 కోట్లు చెల్లించింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్ సహా 8.5 సంవత్సరాలలో ప్రాజెక్టు నిధులను మొత్తం చెల్లించాలి.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications