రూ.కోటి కంటే అధిక ఆదాయం పొందుతున్న డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ సంఖ్య 2,200. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న డాక్టర్లు, సీఏల సంఖ్యను వెల్లడించింది. 2018-19 ఆదాయపు పన్ను వివరాలను కూడా పేర్కొంది. ఈ మేరకు సోషల్ అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

2,200 మంది డాక్టర్లు, సీఏలు, లాయర్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో ITR ఫైల్ చేసిన వ్యక్తుల్లో 2,200 మంది డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణుల ఆదాయం రూ.1 కోటి దాటింది. ఇది కేవలం వారి ప్రధాన ఆదాయం. ఇతర మార్గాల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఇందులో కలపలేదు.

మోడీ వ్యాఖ్యలతో ఏకీభవించిన ఐటీ శాఖ
ప్రజలు దేశ అభివృద్ధి కోసం పన్నులు చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం కోరారు. ఎక్కువ పన్నులు ఎగ్గొట్టడంతో నిజాయితీగా పన్నులు చెల్లించే వారిపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆదాయపు పన్ను శాఖ ఏకీభవించింది. ప్రధాని మోడీని సమర్థిస్తూ ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్యను పేర్కొంది.

ఇదీ లెక్క..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.78 కోట్ల మంది ఇండివిడ్యువల్స్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని తెలిపింది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆస్తులను 3.16 లక్షల మంది ఇండివిడ్యువల్స్ పేర్కొన్నారు. రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులను రూ.8,600 మంది పేర్కొన్నారు. ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో 2,200 మంది డాక్టర్లు, సీఏలు, లాయర్లు వంటి వృత్తి రంగాల్లో ఉన్నవారు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆదాయం చూపించారు.

లక్షల్లో ఆదాయం..
1.03 కోట్ల మంది ఇండివిడ్యువల్స్ రూ.2.5 లక్షలు కాగా, 3.29 కోట్ల మంది ఆదాయం రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షలుగా ఉంది. వీరిలో రూ.5 లక్షల లోపు ఆదాయం చూపిన 4.32 కోట్ల మందికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 1.6 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంది. వీరిలో కోటి మంది రూ.10 లక్షల లోపు, 46 లక్షల మంది రూ.10 లక్షలకు పైగా ఆదాయం చూపించారు. 3.16 లక్షల మంది మాత్రమే రూ.50 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications