కరోనా మహమ్మారి కారణంగా తమ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడిందని PwC ఇండియా సర్వేలో 79 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే 52 శాతం మంది రానున్న పన్నెండు నెలల్లో ఆర్థిక రికవరీ చోటు చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. డిమాండ్ లేక ఆదాయాలు తగ్గడం, వేతనాల్లో కోత, ఉద్యోగాల కోత చోటు చేసుకుంది. ఇటీవలే రికవరీ ప్రారంభమైంది. రష్యా వ్యాక్సీన్ వచ్చింది. ఇతర దేశాల వ్యాక్సీన్స్ సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో PwC ఇండియా సర్వే నిర్వహించింది.

వ్యాక్సీన్ వస్తేనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది
కరోనా వ్యాధికి వ్యాక్సీన్ త్వరగా రావాల్సిన అవసరం ఉందని, దేశ ఆర్థిక పునరుజ్జీవనానికి అది ఎంతో ముఖ్యమని ఈ అకౌంటింగ్, కన్సల్టింగ్ సేవల సంస్థ PwC ఇండియా సర్వే నివేదికలో వెల్లడైంది. కరోనా వెలుగు చూడగానే లాక్ డౌన్ విధించడంతో వైద్య, ఆరోగ్య సదుపాయాలను సమాయత్తం చేయగలిగినట్లు ఎక్కువమంది తెలిపారు. కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం చేయడానికి వెసులుబాటు కలిగిందని తెలిపింది. ఇంత జరిగినా ఆర్థిక వ్యవస్థ రికవరీకి టీకా ఆవిష్కరణ ఎంతో ముఖ్యమని, అలాగే వ్యాక్సీన్ వచ్చాక ఎక్కువ జనాభా కలిగిన మనలాంటి దేశంలో దీని పంపిణీ పెద్ద సవాల్ అని పేర్కొంది.

ఇవన్నీ దెబ్బతిన్నాయి
కరోనా వల్ల డిమాండ్, సప్లై చైన్ పైన తీవ్ర ప్రభావం పడిందని, 1979 తర్వాత తొలిసారి తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. దీనికి తోడు లాక్ డౌన్ సమయంలో మైగ్రేంట్ వర్కర్స్ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సప్లై చైన్ దెబ్బతిన్నది. జీడీపీలో 75 శాతం వాటా కలిగిన 9 రంగాలపై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు తెలిపింది. కేవలం ఆరోగ్యం, భద్రతారంగాల్లో కొత్త ఉత్పత్తులకు, సేవలకు డిమాండ్ పెరిగింది.

ఆర్థిక వ్యవస్థకు దోహదం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి ఎప్పుడు కోలుకుంటుందో చెప్పడం కష్టమని PwC ఇండియా పేర్కొంది. 2020 రెండో అర్ధ సంవత్సరంలో రికవరీ పూర్తిగా సాధ్యం కాదని తెలిపింది. మౌలిగ సదుపాయాల ప్రాజెక్టులు, ఆరోగ్య రంగం పైన ప్రభుత్వం వెచ్చించే నిధులు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఉపకరిస్తాయని తెలిపింది. ప్రభుత్వ వ్యయం జీడీపీలో 11.8 శాతంగా ఉంది. 2023 నాటికి ఇది మరో 5 శాతం నుండి 7 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. నిరుద్యోగం కొంత తగ్గిందని, అయితే 11 శాతంగా ఉందని ఇది ఆందోళనకరమేనని అభిప్రాయపడింది. ఈ సర్వేలో 1500 మంది పాల్గొన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications