Hyderabad: మరో ఘనత సాధించిన హైదరాబాద్.. ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన భాగ్యనగరం..
హైదరాబాద్ మరో ఘనత సాధించింది. 2023లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లను నియమించుకోవడంలో భారతదేశంలోని అగ్రశ్రేణి నగరంగా భాగ్యనగరం అవతరించింది. అంతే కాకుండా టెక్కీలను నియమించుకునే ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో పట్నంకు స్థానం దక్కింది. సీటెల్‌కు చెందిన టెక్నికల్ ఇంటర్వ్యూ సంస్థ కారత్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్ 20 ఐటీ హబ్‌లలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కింది.

US తర్వాత
US తర్వాత, 2023లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లను నియమించుకునే టాప్ 20 నగరాల్లో హైదరాబాద్‌తో పాటు చెన్నై, గుర్గావ్, బెంగళూరు, పూణే, ముంబై ఉన్నాయి. ఈ నగరాలు లాస్ ఏంజిల్స్, కాన్సాస్ సిటీ మరియు పిట్స్‌బర్గ్‌ల కంటే ముందున్నాయి.దరాబాద్‌తో పాటు చెన్నై, గుర్గావ్, బెంగళూరు, పూణే, ముంబైల్లో అత్యధిక సంఖ్యలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ఉన్నారని నివేదిక పేర్కొంది. గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
టాప్ 10 జాబితాలో
2023లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లను నియమించుకోవడానికి ప్రపంచంలోని టాప్ 10 నగరాలను విశ్లేషిస్తే, భారతదేశంలో హైదరాబాద్ మాత్రమే స్థానం సంపాదించింది. టాప్ 10 జాబితాలో, USA నుంచి నాలుగు, కెనడా నుంచి రెండు, సింగపూర్, జపాన్, UK, భారత్ నుంచి ఒక్కొక్క నగరం చోటు దక్కించుకుంది.

టాప్ 10 జాబితాలో
ప్రపంచంలోని టాప్ 20 నగరాల జాబితాలో సింగపూర్, టోక్యో, వాంకోవర్, టొరంటో, సీటెల్ మెట్రో ప్రాంతం, శాన్ ఫ్రాన్సిస్కో బే, ఏరియా, న్యూయార్క్ , బోస్టన్, లండన్, హైదరాబాద్, వాషింగ్టన్ డీసీ, చెన్నై, గుర్గావ్, ఆస్టిన్, బెంగళూరు, చికాగో, పూణే, డెన్వర్, శాన్ డియాగో, ముంబై ఉన్నాయి. 2023లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లను నియమించుకోవడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, కెనడియన్ నగరాల్లో వాంకోవర్ అగ్రస్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications