నిన్నమొన్నటిదాకా విపరీతంగా పెరిగిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా మళ్లీ పడిపోయాయి. బంగారం ధరల్లో భారీ పతనం కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 440 రూపాయల మేర బంగారం ధరలు తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది.
గత కొంత కాలంగా ఆల్టైమ్ రికార్డు ధరలను బద్దలు కొడుతూ దూసుకుపోతున్న బంగారం ధర తాజాగా పడిపోయింది. ప్రస్తుతం ఆర్నమెంట్ గోల్డ్ ధర 57 వేల రూపాయల దిగువకు ఉండగా, స్వచ్ఛమైన బంగారం ధర 62 వేల రూపాయల దిగువకు చేరుకుంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలలో విపరీతమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

దేశీయంగా నేటి బంగారం ధరలను చూస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,550 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 690 గా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర 61,840 రూపాయలుగా ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆర్నమెంట్ గోల్డ్ ధర ప్రస్తుతం 56, 550 రూపాయలు గా 10 గ్రాములకు విక్రయించబడుతుంటే, స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల కు ముంబైలో 61 వేల 690 రూపాయలు గా ప్రస్తుతం ట్రేడవుతోంది. బెంగళూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61వేల 740 రూపాయలుగా విక్రయించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,550 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 690 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!



Click it and Unblock the Notifications