గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించకుండా చైనా టెలికం దిగ్గజం హువావేను అమెరికా నిషేధించిన అనంతరం ప్రత్యామ్నాయ యాప్ ఎకోసిస్టం నిర్మాణంపై ఈ చైనీస్ దిగ్గజం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆండ్రాయిడ్‌కు సమాధానంగా హార్మోనీఓఎస్‌ను ప్రకటించి దాదాపు ఏడాది అవుతోంది. చైనాలో దీనిని హాంగ్‌మెంగ్ఓఎస్‌గా పిలుస్తారు. హువావే, హానర్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ స్థానంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఓఎస్ అధికారిక విడుదల త్వరలో జరగనుంది.

కొత్త ఆపరేటింగ్ సిస్టం
స్మార్ట్ ఫోన్లలో వచ్చే ఏడాది నుండి తమ నూతన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వస్తుందని హువావే తాజాగా వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ల కోసం యాప్స్ తయారు చేస్తున్న డెవలరప్లకు డిసెంబర్ నుండి హార్మోనీ ఓఎస్ సోర్స్ కోడ్ అందుబాటులోకి వస్తుందని హువావే కన్స్యూమర్ ప్రోడక్ట్స్ డివిజన్ సీఈవో యు చెంగ్‌డాంగ్ తెలిపారు. హార్మోనీ ఓఎస్‌ను ఇప్పటి వరకు స్మార్ట్ టీవీలు, ఈన్-కార్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్, వేరబుల్ డివైజ్‌లలో ఉపయోగిస్తున్నారు. కంపెనీ స్మార్ట్ ఫోన్లలో ఇప్పటి వరకు ఉపయోగించలేదు. శాంసంగ్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారు హువావే. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో శాంసంగ్‌ను హువావే వెనక్కి నెట్టిందని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.

2021లో లాంచ్
హోర్మోనీఓఎస్ రెండో వర్షన్ స్మార్ట్ ఫోన్లలతో పాటు విస్తృత శ్రేణి పరికరాలకు విడుదల చేయబడుతుందని కంపెనీ సీఈవో రిచర్డ్-యూ అన్నారు. వచ్చే ఏడాది నుండి అందుబాటులోకి రావొచ్చునని తెలిపింది. హార్మోనిఓఎస్ 2.0 ఎస్డీకే బీటా వర్షన్‌ను డిసెంబర్ 2020లో విడుదల చేయాలని హువావే యోచిస్తోంది. హార్మోనీఓఎస్ ఆపరేటింగ్ ఫస్ట్ ఫోన్లు 2021లో లాంచ్ చేయనున్నారు.

స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాదు..
వివిధ కారణాలతో గూగుల్ నుండి అన్ని సాఫ్టువేర్ల నిషేధాన్ని ఎదుర్కొంటోంది హువావే. గూగుల్ అన్ని సాఫ్టువేర్‌లకు ప్రత్యామ్నాయంగా హార్మోనిఓఎస్ భర్తీ చేయగలదని కంపెనీ సీఈవో వెల్లడించారు. ఇవి కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదని తెలిపారు. భవిష్యత్తులో హువావే ట్యాబ్స్, పీసీలకు కూడా ఈ సాఫ్టువేర్ అందుబాటులో ఉంటుందన్నారు.
More From GoodReturns

మళ్లీ టారిఫ్ బాదుడు మొదలు పెట్టిన ట్రంప్.. ఇరాన్‌తో పాటు చైనా అంతు కూడా చూస్తామని సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications