ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం వచ్చేవారం ముగియబోతోంది. వచ్చే శుక్రవారం నాటికి ఈ థర్డ్ క్వార్టర్ క్లోజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెద్దగా సందడి కనిపించట్లేదు ఇప్పటిదాకా. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా పుంజుకోవట్లేదు. బుధ, గురువారాల్లో కొంత ఫర్వాలేదనిపించిన మార్కెట్ల.. శుక్రవారం మళ్లీ దిగజారాయి. 196 పాయింట్ల మేర నష్టపోయాయి. ఈ పరిస్థితుల్లో వచ్చేవారం స్టాక్ మార్కెట్ అత్యంత కీలకంగా మారింది. కొత్త సంవత్సరాన్ని ఎలా డ్రైవ్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఫుల్ ప్యాక్డ్
కొత్త సంవత్సరం కావడం, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆరంభం అవుతుండటం వల్ల పలు కంపెనీలు తమ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లను జారీ చేయడానికి సమాయాత్తమౌతోన్నాయి. వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవడానికి సిద్ధం అయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్స్ గూడ్స్, రియల్టీ, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్.. ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన పబ్లిక్ ఇష్యూలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి.

చివరివారంలో మిగిలినవి ఇవే..
ఈ మూడో త్రైమాసికం- మూడు కంపెనీలకు చెందిన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ లిస్టింగ్‌తో ముగియనుంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కానున్నాయి. ఆయా కంపెనీలు ఇప్పటికే పబ్లిక్ ఇష్యూలను జారీ చేశాయి. అంచాలకు అనుగుణంగా రిటైల్, క్వాలిఫైడ్, నాన్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూటషనల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించుకోగలిగాయి. అవి ఎంత మాత్రం లాభాలను ఇవ్వగలుగుతాయనేది వచ్చేవారం తేలిపోతుంది.

హెచ్‌పీ అఢెసివ్స్
హెచ్‌పీ అఢెసివ్స్- ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 16-20 తేదీల్లో ముగిసింది. సైజ్ 700 కోట్ల రూపాయలు. కొత్తగా 200 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి పబ్లిక్ ఇష్యూలను జారీ చేసింది. ఆఫర్ ఫర్ సేల్ 500 కోట్ల రూపాయలు. ప్రైస్ బ్యాండ్ 265-274 రూపాయలు. సబ్‌స్క్రిప్షన్ ఆశించిన స్థాయిలోనే సాగింది. 20.96 టైమ్స్ ఇది సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రైస్ 80 రూపాయలు. సోమవారం లిస్టింగ్ కానుంది.

సుప్రియా లైఫ్ సైన్సెస్..
సుప్రియా లైఫ్ సైన్సెస్ - ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 15-17 తేదీల్లో ముగిసింది. సైజ్ 126 కోట్ల రూపాయలు. కొత్తగా 113 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి పబ్లిక్ ఇష్యూలను జారీ చేసింది. ప్రైస్ బ్యాండ్ 262-271 రూపాయలు. సబ్‌స్క్రిప్షన్ ఆశించిన స్థాయిలోనే సాగింది. 71.51 టైమ్స్ ఇది సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రైస్ 140 రూపాయలు. మంగళవారం లిస్టింగ్ కానుంది.

సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్- ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 21-23 తేదీల్లో ముగిసింది. సైజ్ 1,100 కోట్ల రూపాయలు. ఆఫర్ ఫర్ సేల్ కింద ఈ మొత్తాన్ని సమీకరించుకోనుంది. ప్రైస్ బ్యాండ్ 205-216 రూపాయలు. సబ్‌స్క్రిప్షన్ పెద్దగా స్పందన రాలేదు. 1.95 టైమ్స్ ఇది సబ్‌స్క్రిప్షన్ పొందింది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రైస్ 5 రూపాయలు. ఈ నెల 31వ తేదీన లిస్టింగ్ కానుంది. దీనిపై ఎవరికీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేవు
More From GoodReturns

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!



Click it and Unblock the Notifications