మార్చి నెలలో కొత్త నియామకాలు (Hiring activity) 18 శాతం తగ్గినట్లు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ వెల్లడిస్తోంది. జాబ్ పోర్టల్ నౌకరీలోని జాబితాల ఆధారంగా నియామక కార్యకలాపాలను నమోదు చేస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నియామకాలు భారీగా పడిపోయాయి. హోటల్స్, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్స్, ఎయిర్ లైన్స్ రంగాలపై భారీ ప్రభావం పడింది.

ఈ రంగాల్లో ఎక్కువగా పడిపోయిన నియామక ప్రక్రియ
ఎక్కువ ప్రభావం హోటల్స్, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ఎయిర్ లైన్స్ రంగాలపై పడింది. ఈ రంగాల్లో హైరింగ్ ఏకంగా 56 శాతం పడిపోయింది. ఆ తర్వాత రిటైల్ రంగంలో నియామక ప్రక్రియలు దాదాపు సగానికి పడిపోయాయి. ఆటో, ఆటో అనుబంధ రంగాల్లో 38 శాతం పడిపోయాయి.

ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలలో ఎంత తగ్గిందంటే
నియామక ప్రక్రియ తగ్గుదల దాదాపు అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ మెట్రో నగరాల్లో మరీ ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 26 శాతం క్షీణించింది. ఆ తర్వాత చెన్నైలో 24 శాతం, హైదరాబాద్‌లో 18 శాతం పడిపోయింది.

ఎంట్రీలెవల్ నుండి అనుభవం వరకు..
ఎక్స్‌పీరియన్స్ పరంగా చూస్తే 13 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఎక్స్‌పీరియన్స్ బాండ్స్ 29 శాతం తగ్గాయి. ఎంట్రీ లెవల్ ఎక్స్‌పీరియన్స్ (0-7 సంవత్సరాలు) 16 శాతం పడిపోయాయి. 8-10 సంవత్సరాల అనుభవం కలిగిన మిడిల్ మేనేజ్‌మెంట్ రోల్స్ 20 శాతం పడిపోయాయి.

20 రోజులు 5 శాతమే.. మార్చి 21 నుండి 31 వరకే..
మార్చి 2020 మొదటి 20 రోజులకు నియామక కార్యకలాపాలు 5 శాతం మాత్రమే క్షీణతను చూశాయి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ తర్వాత పది రోజుల్లోనే గణనీయమైన క్షీణత నమోదు చేసింది. దీంతో నియామకాల ప్రక్రియ 18 శాతం పడిపోయింది.

సాఫ్టువేర్, ఫైనాన్స్ రంగాలు కాస్త బెట్టర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఐటీ ఎనేబుల్డ్, సర్వీసెస్, బీఎఫ్ఎస్ఐ, ఫైనాన్స్ వంటి రంగాల్లో మాత్రం ఈ క్షీణత కాస్త తక్కువగా ఉంది. రంగాల వారీగా చూస్తే... హోటల్స్/రెస్టారెంట్/ట్రావెల్/ఎయిర్ లైన్స్ (56%), రిటైల్ (50%), ఆటో/అనుబంధ రంగాలు (38%), ఫార్మా (26%), ఇన్సురెన్స్ (11%), అకౌంటింగ్/ఫైనాన్స్ (10%), ఐటీ సాఫ్టువేర్ (9%), BFSI (9%) క్షీణించింది.

ఐటీలో 7 శాతం, BPOలో కేవలం 1 శాతమే తగ్గుదల
IT, BPO/ITES, BFSI, Accounting/Finance రంగాల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మరీ దారుణంగా ఏమీ పడిపోలేదు. వీటిలో 10 శాతం లోపే తగ్గింది. IT-Software ఇండస్ట్రీలో 9%, IT-Hardware 7%, Accounting/Financeలో 10%, BFSIలో 9% తగ్గుదల నమోదు కాగా, BPO/ITES అయితే కేవలం 1% మాత్రమే తగ్గుదల నమోదయింది.

హోటల్ రంగంలో 51 శాతం
Hotel/Restaurants రంగంలో 51 శాతం, Ticketing/Travel/ Airlines రంగంలో 48 శాతం, Marketing/Advertising/MR/PR రంగంలో 33% నియామకాలు క్షీణించాయి. HR/Administration (29%), Banking/Insurance (23%), Sales/Business Development (20%), IT-Software (16%) క్షీణించాయి.

హైదరాబాద్ నగరంలో ఏ రంగం ఎంత క్షీణించిందంటే
ఢిల్లీలో 26 శాతం, చెన్నైలో 24 శాతం, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో 15 శాతం, ముంబైలో 14 శాతం, పుణేలో 12 శాతం నియామకాలు క్షీణించాయి. హైదరాబాద్ విషయానికి వస్తే 18 శాతం క్షీణించాయి. ఇక్కడ హాస్పిటాలిటీ రంగంలో 62 శాతం, ఆటో/అనుబంధ రంగాల్లో 46 శాతం, BFSI 40 శాతం క్షీణించింది. ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే సగటున 24 శాతం క్షీణించింది. హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ రంగాల్లో 59 శాతం, 44 శాతం తగ్గింది.

ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైలలో..
ఢిల్లీ విషయానికి వస్తే హాస్పిటాలిటీలో 66 శాతం, ఫార్మాలో 43 శాతం పడిపోయింది. బ్యాంకింగ్ (28%), అకౌంటింగ్ (23%), IT-హార్డ్‌వేర్‌లో (22%) తగ్గింది.
చెన్నైలో Hospitality, IT-Software, Banking రంగాల్లో వరుసగా 63%, 27%, 21% పడిపోయాయి. IT-Hardwareలో 14 శాతం నమోదయింది.
బెంగళూరులో Hospitality, Auto/ఆటో అనుబంధ రంగాల్లో వరుసగా 63 శాతం, 32 శాతం క్షీణత నమోదయింది. BPO/ITESలో 6 శాతం తగ్గింది.
ముంబైలో Hospitality నియామకాలు 60 శఆతం, అకౌంటింగ్ రంగంలో 38 శాతం తగ్గాయి.
పుణేలో Hospitality (61%), BFSI (54%), BPO/ITES, ఫార్మా రంగాల్లో వరుసగా 21%, 11% తగ్గింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications