గుడ్‌న్యూస్: నియామకాలు పెరిగాయ్, మీడియా-హెచ్ఆర్ జూమ్, మెట్రోల కంటే అక్కడే ఎక్కువ ఉద్యోగాలు
కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. జాబ్ మార్కెట్ కోలుకుంటోంది. జూన్ నెలతో పోలిస్తే జూలై మాసంలో హైరింగ్ యాక్టివిటీస్ 5 శాతం మేర పెరిగినట్లు నౌకరీ జాబ్ స్పీక్ వెల్లడించింది. జూన్ నెల నుండి లాక్ డౌన్ రిలక్సేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో వ్యాపారాలు, కంపెనీలు తెరుచుకోవడం, ఉద్యోగా కల్పన పెరగడం ప్రారంభమైందని వెల్లడించింది. జూన్ నెలతో పోలిస్తే జూలైలో ఐదు శాతం నియామక ప్రక్రియలు పెరిగాయి.

హెచ్ఆర్, మీడియాలో జోరుగా నియామకాలు.. ఏ రంగంలో ఎన్ని
జులై మాసంలో నియామకాలు అధికంగా మీడియా, ఎంటర్టైన్మెంట్, హెచ్ఆర్ రంగంలో పెరిగాయి. ఈ రంగాల్లో వరుసగా 36%, 37% నియామక ప్రక్రియలు పెరిగాయి. కన్‌స్ట్రక్షన్, ఇంజినీరింగ్ రంగంలో 27%, బీఎఫ్ఎస్ఐ 16%, ఆటో 14%, టెలికం 13%, ఐటీ-హార్డ్‌వేర్ 9%.. జూన్ నెలతో పోలిస్తే జూలైలో నియామకాలు పెరిగాయి. ఐటీ సాఫ్టువేర్‌లో ఎలాంటి హైరింగ్ కనిపించలేదు. ఎడ్యుకేషన్, టీచింగ్‌లో 22% ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఆతిథ్య రంగంలో 5% పడిపోగా, రిటైల్ రంగంలో 2 శాతం క్షీణత నమోదు చేసింది.

నగరాలపరంగా చూస్తే..
మెట్రో నగరాల్లో నియామక ప్రక్రియలు వేగంగా పెరిగాయి. ఢిల్లీ/ఎన్సీఆర్ 10%, ముంబై 8%, చెన్నైలో 4% పెరిగింది. బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 4% క్షీణించడం గమనార్హం. టైర్ 2 నగరాలైన జైపూర్, వడోదర, చండీగడ్ వంటి నగరాల్లో నియామక ప్రక్రియ బాగా వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. జైపూర్‌లో ఏకంగా 40%, వడోదరలో 35% ఉంది.

రెండు మినహా ఈ రంగాల్లో సాధారణ పరిస్థితికి..
జులై నెలలో అంతకుముందు నెలలతో పోలిస్తే నియామకాల ప్రక్రియ ఊపందుకుందని తెలిపింది. రిక్రూట్మెంట్, మీడియా, వినోదం, నిర్మాణ రంగాల్లో సాధారణ పరిస్ధితి తిరిగి నెలకొంటోందని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. తయారీ, నిర్వహణ, ఫార్మా, మీడియా, మార్కెటింగ్, ప్రకటనలు, సేల్స్ రంగాల్లో జాబ్ హైరింగ్స్ ఊపందుకున్నాయని తెలిపారు. ఆతిథ్య, బోధన రంగాల్లో నియామకాలు మాత్రం ఇంకా పుంజుకోలేదన్నారు.

మిడ్-సీనియర్లకు మళ్లీ డిమాండ్
ఎక్స్‌పీరియన్స్ పరంగా జూలై నెలలో నియామక ప్రక్రియలు 5% పెరిగాయి. మిడ్ అండ్ సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (8-16 ఏళ్ల అనుభవం) 6% పెరిగింది. జూన్ నెలతో పోలిస్తే 5% నియామక ప్రక్రియలు పెరిగినప్పటికీ, గత ఏడాది జూలైతో పోలిస్తే 47% తక్కువే.


Click it and Unblock the Notifications