ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ టెక్నాలజీ దిగ్గజం హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ... 2020 లో భారీ స్థాయిలో ఉద్యోగాలు ఉవ్వబోతోంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో కొలువులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు, లేదా చివరి సెమిస్టరు ఎగ్జామ్స్ రాస్తున్నవారికి ఇదొక వరమని చెప్పాలి. దేశంలో ఆర్థిక మందగమనం అలుముకుంటున్న సమయంలో ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. అలాంటి సమయంలో వేలకొద్దీ కొత్త ఉద్యోగాలు రావటం, అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొలువు దొరకటం నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ మరో తీపి కబురును కూడా అభ్యర్థులకు పంచబోతోంది. అదేమిటంటే.... గతంలో కంటే మెరుగైన ప్యాకేజీలను ఆఫర్ చేయబోతోంది. ఈ ఏడాది నుంచి దీనిని అమలు చేయబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకవైపు జాబ్ ఆఫర్, మరో వైపు బెటర్ శాలరీ... వెంటనే అప్లై చేయండి మరి!

రెట్టింపు ఉద్యోగాలు...
ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హెచ్ సి ఎల్ టెక్నాలజీస్... 2020-21 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. గతేడాది ఈ సంఖ్య కేవలం 8,600 మాత్రమే కావటం గమనార్హం. అంటే, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో ఫ్రెషర్స్ ను అపాయింట్ చేసుకుంటోంది. అటు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, మానేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనుంది. మొత్తం 15,000 ఫ్రెషర్స్ లో ఒక 500 మందిని టాప్ బిజినెస్ స్కూల్స్ నుంచి హైర్ చేసుకోనుంది. వీరందరికీ మెరుగైన వేతనాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.

రూ 3.8 లక్షల వేతనం...
ఫ్రెషర్స్ కు ఇచ్చే వేతన ప్యాకేజీలు కూడా పెరగబోతున్నాయి. ఈ ఏడాది నుంచి ఫ్రెషర్స్ కు 15-20% అధిక వేతనాలను ఆఫర్ చేస్తామని హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వీ వీ అప్పారావు వెల్లడించారు. దీంతో ప్రతి ఇంజనీరింగ్ అభ్యర్థికి కనీసం రూ 3.6 లక్షల నుంచి రూ 3.8 లక్షల వేతనం లభిస్తుంది. అదే సమయంలో ఇండియా లోని టాప్ బిజినెస్ అండ్ మానేజ్మెంట్ స్కూల్స్ నుంచి వచ్చే వారికి మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుతున్నాయి. ఐ ఐ ఎం - అహ్మదాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ ఎస్ బి), ఐఐఎం బెంగుళూరు, ఐఐఎం కోల్కతా, ఎస్ పీ జైన్, ఎక్స్ ఎల్ ఆర్ ఐ వంటి సంస్థల్లో చదివిన వాటికి రూ 20 లక్షల నుంచి రూ 23 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తోంది. ఐఐఎం ఇండోర్, లక్నో, కోజిఖోడ్ కాలేజీల విద్యార్థులకు రూ 15 లక్షల నుంచి రూ 18 లక్షల వేతనం ఆఫర్ చేస్తున్నారు. ఇక మిగిలిన మానేజ్మెంట్ కాలేజీల విద్యార్థులకు రూ 4.5 లక్షల నుంచి రూ 7 లక్షల వరకు వేతనం అందనుంది. ఇదిలా ఉండగా, ఐ ఐ టీ విద్యార్థులకు రూ 12 లక్షల నుంచి రూ 15 లక్షల వేతనం, ఎన్ ఐ టీ విద్యార్థులకు రూ 8 లక్షల నుంచి రూ 12 లక్షల శాలరీ నిర్ణయించారు.

అమెరికా లోనూ దూకుడే...
ఇండియా తో పాటు అమెరికా లో కూడా హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ పెద్ద ఎత్తున క్యాంపస్ హైరింగ్ చేపట్టనుంది. గతేడాది సుమారు 3,000 మంది అమెరికన్ ఫ్రెషర్స్ ను హైర్ చేసుకున్న కంపెనీ... ఈ ఏడాది మరో 10-15% అధిక సంఖ్యలో ఆఫర్స్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్ సి ఎల్ కు సుమారు 20,000 ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 67% మంది అమెరికన్లే కావటం విశేషం. పెరుగున్న డిమాండ్ కు అనుగుణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమిస్తున్నామని, ఆ మేరకు తమకు భారీ స్థాయిలో ప్రాజెక్టులు పైప్లైన్ లో ఉన్నాయని అప్పారావు వెల్లడించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications