For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST collection: నవంబర్ నెలలో రూ.1 లక్ష కోట్లు దాటిన వసూళ్లు

|


న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లు మరోసారి రూ.1 లక్ష కోట్లు దాటాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలకు గాను జీఎస్టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్ నెలతో పోలిస్తే స్వల్పంగా తగ్గగా, గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే 1.4శాతం పెరిగాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.05 కోట్లు దాటాయి. గత ఏడాది నవంబర్ నెలలో రూ.1,03,491 కోట్లుగా ఉన్నాయి.

పండుగ సమయంలో ఉద్యోగులకు అమెజాన్ ప్రత్యేక గుర్తింపు బోనస్పండుగ సమయంలో ఉద్యోగులకు అమెజాన్ ప్రత్యేక గుర్తింపు బోనస్

వరుసగా రూ.లక్షకోట్ల పైకి

వరుసగా రూ.లక్షకోట్ల పైకి

నవంబర్ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.19189 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.25,540 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.51,992 కోట్లు వసూలయ్యాయి. ఇందులో దిగుమతులపై పన్ను ద్వారా రూ.22,078 కోట్లు ఉంది. సెస్ కింద రూ.8,242 కోట్లు సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల కాలంలో 8 నెలలు జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది కరోనా, లాక్ డౌన్ వల్ల వసూళ్లు భారీగా క్షీణించాయి. అయితే అక్టోబర్, నవంబర్ వరుస నెలల్లో వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటడం గమనార్హం.

గత ఏడాదితో పోలిస్తే...

గత ఏడాదితో పోలిస్తే...

గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. మిగతా నెలల్లో భారీగా క్షీణించాయి. లాక్డౌన్ ప్రారంభమైన ఏప్రిల నెలలో రూ.32,172 కోట్లుగా నమోదయ్యాయి. 2019లో రూ.1,13,865 కోట్లు వసూలయ్యాయి. 2019 మేలో రూ.1,00,289 కోట్లు, 2020 మేలో రూ.62,151 కోట్లు, గత ఏడాది జూన్‌లో రూ.99,939 కోట్లు, ఈ ఏడాది అదే నెలలో రూ.90,917 కోట్లు, 2019 జూలైలో రూ.1,02,083 కోట్లు, ఈ జూలైలో రూ.87,422 కోట్లు, గత ఏడాది ఆగస్ట్‌లో రూ.98,202 కోట్లు, ఈ ఏడాది అదే నెలలో రూ.86,449 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌లో భారీగా పతనమైన జీఎస్టీ వసూళ్లు.. ఆ తర్వాత ఆగస్ట్ వరకు ఏడాది ప్రాతిపదికన తక్కువే వసూలయ్యాయి. సెప్టెంబర్ నుండి గత ఏడాదికంటే పెరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో గత ఏడాది కంటే పెరిగాయి.

82 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్

82 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్

నవంబర్ నెలలో 82 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ దాఖలయ్యాయి. నవంబర్ నెలలో ఉత్పత్తుల దిగుమతి వల్ల ఆదాయం 4.9 శాతం పెరిగింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ (దిగుమతుల సేవలు కలిపి) ఆదాయం 0.5 శాతం పెరిగింది. కరోనా కారణంగా దెబ్బతిన్న కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో వేగంగా వృద్ధిని సాధించాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి సంకోచం తగ్గింది.

English summary

GST collection: నవంబర్ నెలలో రూ.1 లక్ష కోట్లు దాటిన వసూళ్లు | GST collection stood At Rs 1,04,963 lakh crore in November

The government said on Tuesday that it collected goods and services tax (GST) amounting to ₹ 1,04 lakh crore in November. The GST revenues were ₹ 1.05 lakh crore in October, marking two successive months wherein the GST revenues have topped the ₹ 1 lakh crore mark.
Story first published: Tuesday, December 1, 2020, 17:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X