ఢిల్లీ: మందగమనం నుంచి బయటపడేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. డిమాండ్ - వినిమయం తగ్గిన నేపథ్యంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచేలా బడ్జెట్‌లో ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోడీ ప్రభుత్వానికి చేదువార్త.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రాబడిలో కోతపడే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కార్పోరేట్ పన్ను, ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గే అవకాశముందని సీనియర్ పన్ను అధికారులు అంటున్నారు. ఆర్థిక మందగమనం, కార్పోరేట్ ట్యాక్స్‌లో కోతకు ఇందుకు కారణమని అంటున్నారు.

మందగమనం నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం తప్పదని అంటున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.13.5 లక్షల కోట్ల వసూలు కావచ్చని మోడీ ప్రభుత్వ బడ్జెట్‌లో అంచనా వేసింది. 2018-19లో నమోదైన రూ.11.5 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే 17% అధికంగా రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం కంటే 10% వరకు తగ్గే ప్రమాదం ఉందని అధికార వర్గాల మాట. ఈసారి వసూళ్లు రూ.10 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశముంది.
బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రూ.3 లక్షల కోట్ల వరకు తగ్గొచ్చు. గత ఇరవై ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంతకుముందు సంవత్సరం కంటే తగ్గిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మందగమనం నేపథ్యంలో ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు తప్పవని అధికారులు అంటున్నారు.
More From GoodReturns

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications