గుడ్‌న్యూస్: ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఏ రంగంలో ఎంతంటే? బెంగళూరు, పుణే అదుర్స్!

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సమయంలో నిరుద్యోగిత రేటు దాదాపు 30 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 9 శాతం దిగువకు వచ్చింది. వైరస్ నేపథ్యంలో కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. డిమాండ్-లేమి కారణంగా మరికొన్ని రంగాల్లో ఉద్యోగాల కోత లేనప్పటికీ, వేతన కోత కనిపించింది. అలాగే కొత్త ఉద్యోగాలు మాత్రం కష్టంగానే కనిపించింది. అయితే ఇప్పుడిప్పుడే జాబ్ మార్కెట్ కోలుకుంటోంది. అన్-లాక్ తర్వాత ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి.

పెరిగిన హైరింగ్ యాక్టివిటీస్

పెరిగిన హైరింగ్ యాక్టివిటీస్

నియామక ప్రక్రియలు జూన్ నెలలో 33 శాతం పెరిగాయి. నౌక్రీ జాబ్ స్పీక్ రిపోర్ట్ ప్రకారం నెలవారీగా 6 కీలకరంగాల్లో నియామక ప్రక్రియలు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ పైన పోరు నేపథ్యంలో వైద్య, ఫార్మా రంగాలకు డిమాండ్ ఉంది. ఫార్మా రంగం షేర్లు కూడా మార్కెట్లో జోరుమీద ఉన్నాయి. కానీ నియామక ప్రక్రియలో మాత్రం ఫార్మారంగం మిగతా వాటితో పోలిస్తే తక్కువ ప్రభావం చూపింది. మే నెలతో పోలిస్తే జూన్‌లో నియామక ప్రక్రియలు 27 శాతం పెరిగాయి.

హైదరాబాద్ ఫార్మాలో తగ్గాయి.. ఐటీ జూమ్

హైదరాబాద్ ఫార్మాలో తగ్గాయి.. ఐటీ జూమ్

దేశ ఫార్మా రంగానికి కీలక నగరం, దేశీయ హబ్ హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా నగరంలోను నియామక ప్రక్రియలు పడిపోయాయి. ఎక్కువ నియామక ప్రక్రియలు ఐటీ, బీపీవో రంగాల్లో చోటు చేసుకున్నాయి. గత ఏడాది కాలంగా ఈ రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తోంది. కరోనా కారణంగా ఈసారి లాభాలు తగ్గినప్పటికీ వచ్చే త్రైమాసికాల్లో ఆశాజనకంగా ఉంటుందని ఐటీ దిగ్గజాలు భావిస్తున్నాయి. కరోనా ప్రభావం తక్కువగా పడిన రంగాల్లో ఐటీ పరిశ్రమ ఒకటి. ఐటీ రంగంలో హైరింగ్ యాక్టివిటీస్ 19 శాతం పెరిగాయి. బీపీవో, ఐటీఈఎస్ రంగాల్లో 48 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్ నగరాల్లో పాజిటివ్ గ్రోత్ కనిపించింది.

బీపీవో అదుర్స్, ట్రావెల్, హాస్పిటాలిటీ నెమ్మది

బీపీవో అదుర్స్, ట్రావెల్, హాస్పిటాలిటీ నెమ్మది

మే నెలతో పోలిస్తే జూన్ మాసంలో బీపీవో, ఐటీఈఎస్ ఇండస్ట్రీలో ఉద్యోగాల నియామకంలో 48 శాతం వృద్ధిని నమోదు చేసింది. పుణే, బెంగళూరు వంటి నగరాలు చాలా వేగంగా కోలుకుంటోన్న సంకేతాలు కనిపించాయి. అయితే కరోనా వల్ల దారుణంగా ప్రభావితమైన ఆతిథ్య, ట్రావెల్ రంగాలు అతి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో మాత్రం 107 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ ఈ రంగాలు కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి.

బెంగళురు, పుణే వృద్ధి వేగవంతం

బెంగళురు, పుణే వృద్ధి వేగవంతం

నౌక్రీ డాట్ కామ్ జాబ్ స్పీక్స్ రిపోర్ట్ ప్రకారం మహమ్మారి కారణంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో రిటైల్ రంగం ఉంది. జూన్ నెలలో (మేతో పోలిస్తే) హైరింగ్స్ 77 శాతం పుంజుకోగా, తదుపరి క్వార్టర్‌లో మరింతగా పెరుగుతాయని ఆశిస్తున్నారు. ముడిపదార్థాల ఎగుమతులు, దిగుమతులు వంటి వాటిలో నియామక కార్యకలాపాలు 77 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వృద్ధికి దోహదపడే నగరాల్లో పుణే, బెంగళూరు ముందున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+