బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. నిన్న భారీగా పడిపోయిన బంగారం ధరలు, నేడు మరోమారు క్షీణించాయి. దీంతో నేడు భారతదేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 55,650 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు తగ్గి 60,710 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
బంగారం కొనుగోలు చేయాలని భావించిన వారికి ప్రస్తుతం తగ్గుతున్న బంగారం ధరలు తీపికబురు చెప్పినట్టుగా అయింది. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బంగారం కొనుగోలు డిమాండ్ పెరుగుతున్న వేళ, బంగారం ధరలు కాస్త తగ్గడం గోల్డ్ లవర్స్ కు నిజంగా ఊరటను ఇచ్చినట్టుగా మారింది. తాజాగా దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,800 రూపాయలు కాగా, నేడు 150 రూపాయలు తగ్గి 55,650 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న హైదరాబాద్ లో 60 వేల 870 రూపాయలు కాగా, నేడు ఈ ధర 160 రూపాయలు తగ్గి 60వేల 710 వద్ద ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 800 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 860 రూపాయల వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,650 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 710 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, కాకినాడ రాజమండ్రి లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,650 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 710 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధరలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం ధరలు తగ్గుతున్న సమయంలో కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపధ్యంలో ప్రస్తుతం బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!



Click it and Unblock the Notifications