పసిడి ప్రియులకు శుభవార్త: బంగారం ధరలు బాగా తగ్గాయోచ్; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్ధం కావటం లేదు. బంగారం ధరలు కాస్త తగ్గాయి అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ పెరగటం, పెరిగాయి అని అందరూ నిరాశ చెందే సమయంలో కాస్త తగ్గటం పరిపాటిగా మారింది. నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ఇలాగే కొంతకాలం పాటు బంగారంధరలు తగ్గితే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తున్నారు .
ఇక నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 450రూపాయలు, 10గ్రాముల స్వచ్చమైన బంగారం మీద 490రూపాయల మేర బంగారం ధరలు తగ్గాయి. దీంతో నేడు 10గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 56,300 రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 61,420 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక దేశంలో నేడు ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూస్తే ..

హైదరాబాద్ లో నిన్న 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,750 రూపాయలుగా ఉండగా నేడు 56,300 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్న 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61, 910 రూపాయలుగా ఉండగా, నేడు 61,420 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర నేడు 56,450 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,570 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 56,300రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది. నిన్న ఈ ధరలు ఆర్నమెంట్ బంగారానికి 56,750 రూపాయలుగా, స్వచ్చమైన 10గ్రాముల బంగారానికి 61, 910 రూపాయలుగా విక్రయించబడింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 56,300 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది. దేశంలోనే బంగారం ధరలు ఎక్కువ ఉండే తమిళ నాడు రాష్ట్రంలోని మదురై, కోయంబత్తూరు, చెన్నై తదితర నగరాల్లో 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర ప్రస్తుతం 56,700రూపాయలు కాగా, 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 61,850 గా ట్రేడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications