బంగారం ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో నేడు బంగారం ధరలిలా ఉన్నాయి.
వరుసగా రెండు రోజు బంగారం ధరలు క్షీణించాయి. గత కొంతకాలంగా దూకుడు కొనసాగిస్తున్న బంగారం ధరలు తాజాగా యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెరుగుదల నేపథ్యంలో క్షీణత దిశగా ప్రయాణం చేస్తున్నాయి. అటు అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ బంగారం ధరలలో గత రెండు రోజుల నుండి స్పష్టంగా తగ్గుదల కనిపిస్తుంది. అయితే బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ, ప్రస్తుతం భారీగా తగ్గుదల నమోదు చేయడం పసిడి ప్రయాణం ఎటువైపు అన్న ఆసక్తిని అందరిలో కలిగిస్తుంది.

హైదరాబాద్ లో బంగారం ధరలిలా
తాజాగా హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాదులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 52,400గా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,000 గా ఉండగా, నేడు ఒక్కరోజే 700 రూపాయలు మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే ఈరోజు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 57,930 గా ఉండగా నేడు ఒక్కరోజే 770 రూపాయలు మేర బంగారం ధర తగ్గింది.

విజయవాడలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
ఇక విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు 52,400గా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,100 గా ఉంది. మొత్తం 700 రూపాయల మేర విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల విషయానికి వస్తే నేడు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 57,930 రూపాయలుగా ఉంది. మొత్తం 770 రూపాయలు మేర 24 క్యారెట్ల బంగారం పై ధర తగ్గింది.

ఢిల్లీలో బంగారం ధరల స్థితి ఇలా
ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 52,550గా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 53,250 గా ఉండగా మొత్తం ఢిల్లీలోనూ 700 రూపాయలు మేర 22 క్యారెట్ల బంగారంపై ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి నేడు 57,310 రూపాయల ధర పలుకుతుంది. ఈ ధర నిన్న 58,080 గా ఉండగా 770 రూపాయలు ధర తగ్గింది.

ముంబైలోనూ తగ్గిన బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,400గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఈదర నిన్న 53,100గా ట్రేడ్ అయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు 57 వేల 160 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 57,930 రూపాయలుగా ట్రేడ్ అయ్యింది.

చెన్నైలో అత్యధికంగా తగ్గిన బంగారం ధరలు .. నేడు ధరలిలా
ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి చెన్నైలో 58,200 ధర ప్రస్తుతం పలుకుతుంది నిన్న ఈ ధర 59,070 గా ఉంది. చెన్నైలో అత్యధికంగా 870 రూపాయల మేర నేడు ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం చెన్నైలో నేడు 53,350లు పలుకుతుంది. ఈ ధర నిన్న 54,150 ఉంది. నిన్నటికి ఈరోజుకి 22 క్యారెట్ల మీద ఎనిమిది వందల రూపాయల మేర ధర తగ్గింది. దేశంలోనే చెన్నై, మధురై, కోయంబత్తూర్ తదితర నగరాలలో 60 వేల మార్కును దాటి బంగారం ధరలు పెరిగిన పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా దూకుడును కొనసాగించిన బంగారం ధరలు ప్రస్తుతం గణనీయంగా తగ్గడం గోల్డ్ లవర్స్ కు కాస్త ఊరట ఇస్తుంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications