పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త: భారీగా పడిపోయిన ధరలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త. నేడు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. నేడు స్వచ్చమైన బంగారం ధరలు ఒక్కసారిగా 770రూపాయలు మేర తగ్గాయంటే ఇది నిజంగానే సంబరాలు జరుపుకోవాల్సిన సమయం అనే చెప్పాలి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. ఆలస్యం చేయకుండా ఈ రోజు బంగారం ధరలు దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం.
నేడు దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 700 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 770 రూపాయలు మేర ధర తగ్గింది. దీంతో నేడు దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 60,330 రూపాయలుగా ట్రేడవుతోంది.

ఇక హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 55, 300 రూపాయలు కాగా, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 330 రూపాయలుగా ట్రేడవుతోంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ లలో కూడా 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,330 రూపాయలుగా కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,450 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 480 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 330 రూపాయలుగా ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ లో 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 55, 300రూపాయలు కాగా, 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 60, 330రూపాయలుగా ట్రేడవుతోంది. ఒకే రోజులో ఏడు వందల రూపాయలకు పైగా బంగారం ధరలు తగ్గటం నిజంగా బంగారం కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం.


Click it and Unblock the Notifications