For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం భారీ పతనం, రూ.3,000 డౌన్: వెండి ఒక్కరోజే రూ.6,100 తగ్గుదల

|

ముంబై: పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఫ్యూచర్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు రూ.2వేలకు పైగా పడిపోయాయి. వెండి ధరలు అయితే రూ.70,000 స్థాయి నుండి రూ.64వేల దిగువకు చేరుకున్నాయి. గత వారంలోని 5 సెషన్లలో మూడు రోజులు ధరలు పెరగగా, రెండుసార్లు తగ్గాయి. ఈ వారం పసిడి ఓ సమయంలో రూ.51,000 దాటి రూ.52,000 దిశగా కనిపించింది. చివరకు రూ.49,000 దిగువన ముగిసింది.

మొదటి రెండు రోజులు రూ.1500 పెరిగిన బంగారం, మరుసటి రోజు రూ.1230 తగ్గింది. గురువారం స్వల్పంగా పెరిగి శుక్రవారం భారీగా తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7400 తక్కువగా ఉంది. కేవలం గతవారం చూస్తే రూ.52,000 సమీపానికి చేరుకొని, రూ.49,000 దిగువకు పడిపోయింది. అంటే గతవారమే రూ.3,000 వరకు తగ్గింది.

రూ.49,000 దిగువకు బంగారం

రూ.49,000 దిగువకు బంగారం

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 2,086.00 (-4.10%) తగ్గి రూ48818.00 వద్ద ముగిసింది. రూ.50,755.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,799.00 వద్ద గరిష్టాన్ని, రూ.48818.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2,077.00 (-4.08%) తగ్గి రూ.48863.00 వద్ద ముగిసింది. రూ.50,850.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,850.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,847.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర రూ.6000 డౌన్

వెండి ధర రూ.6000 డౌన్

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.6100కు పైగా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 6,112.00 (-8.74%) క్షీణించి రూ.63850.00 వద్ద ముగిసింది. రూ.69,694.00 వద్ద ప్రారంభమై, రూ.69,825.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,719.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.6,042.00 (-8.51%) పెరిగి రూ.64938.00 వద్ద ముగిసింది. రూ.70,705.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,705.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,733.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిగువకు పసిడి

1850 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పతనమైంది. అయితే 1850 డాలర్లకు దిగువకు వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -63.70 (-3.33%) డాలర్లు తగ్గి 1849.90 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 1,828.00 - 1,918.00 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. ఔన్స్ ధర 1.769 (-6.49%) డాలర్లు తగ్గి 25.492 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 24.543 - 27.335 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40 శాతం పెరిగింది.

English summary

బంగారం భారీ పతనం, రూ.3,000 డౌన్: వెండి ఒక్కరోజే రూ.6,100 తగ్గుదల | Gold slips Rs 2,100, Silver by Rs 6,000 in a day: Yellow metal falls below rs 49000

Gold prices tanked to settle at Rs 48,818 per 10 gram on January 8 as participants increased their short position as seen by the open interest. The precious metal ended the week with a loss of Rs 1,417 or 2.82 percent for the week.
Story first published: Sunday, January 10, 2021, 7:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X