మళ్ళీ దిగొచ్చిన బంగారం; నేడు హైదరాబాద్ లో బంగారం ధరలిలా!!
వరుసగా రెండో రోజు కూడా మళ్లీ బంగారం ధరలు పడిపోయాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఆందోళన కలిగిస్తే, ఇప్పుడిప్పుడు మళ్ళీ తగ్గుతున్న బంగారం ధరలు కాస్త ఊరట ఇస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలలో విపరీతమైన హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే బంగారం ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయికి చేరుకున్నాయి.
మొన్న రికార్డు స్థాయిలో ఆల్ టైం హైగా నిలిచిన బంగారం ధరలు నిన్న, ఈరోజు కాస్త తగ్గు ముఖం పట్టాయి. భారతదేశంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మీద వంద రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మీద 110 రూపాయలు బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికొస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,020 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
ఇక బెంగళూరులో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,850 గా ప్రస్తుతం విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,920 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, తిరుపతి, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,870 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా బంగారం ధరలు, స్వచ్ఛమైన బంగారం మీద 60,000 దాటే ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారతదేశంలో బంగారం ధరలు అధికంగా ఉండే తమిళనాడు రాష్ట్రంలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, తిరునవ్వేలి, తిరుచ్చి, తిరుపూర్, ఈ రోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,400 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,530 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications